
భారత రోయర్లు అర్జున్–అరవింద్ సింగ్ ఒలింపిక్స్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ముందంజ వేశారు. లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ ఈవెంట్‌లో సెమీఫైనల్లోకి చేరారు. టోక్యోలోని సీ ఫారెస్ట్ వాటర్‌వేలో ఆదివారం జరిగిన రెపిచేజ్ రౌండ్‌లో భారత జోడీ పోటీని 6ని:51.36 సెకన్ల టైమిం గ్‌తో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. శనివారం జరిగిన హీట్స్‌లో అర్జున్– అరవింద్ ద్వయం ఐదో స్థానంలో నిలిచింది. ఇదే ఉత్సాహంతో 28న జరిగే గ్రూప్ ‘బి’ సెమీఫైనల్లో భారత జట్టు టాప్–3లో నిలిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. గ్రూప్ ‘ఎ’ నుంచి మరో మూడు జోడీలు ఫైనల్‌కు చేరుతాయి.
Comments
Please login to add a commentAdd a comment