Arvind singh
-
రోయర్ల తడాఖా...
భారత రోయర్లు అర్జున్–అరవింద్ సింగ్ ఒలింపిక్స్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ముందంజ వేశారు. లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ ఈవెంట్లో సెమీఫైనల్లోకి చేరారు. టోక్యోలోని సీ ఫారెస్ట్ వాటర్‌వేలో ఆదివారం జరిగిన రెపిచేజ్ రౌండ్లో భారత జోడీ పోటీని 6ని:51.36 సెకన్ల టైమిం గ్‌తో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. శనివారం జరిగిన హీట్స్‌లో అర్జున్– అరవింద్ ద్వయం ఐదో స్థానంలో నిలిచింది. ఇదే ఉత్సాహంతో 28న జరిగే గ్రూప్ ‘బి’ సెమీఫైనల్లో భారత జట్టు టాప్–3లో నిలిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. గ్రూప్ ‘ఎ’ నుంచి మరో మూడు జోడీలు ఫైనల్‌కు చేరుతాయి. -
హోంమంత్రి బంధువు కాల్చివేత
లక్నో: కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీప బంధువు అరవింద్ సింగ్ మంగళవారం అర్థరాత్రి దారుణ హత్యకు గురైయ్యారు. వారణాసి జిల్లాలోని పూల్పూర్లో అరవింద్ సింగ్.. తన భార్యను కారులో ఎయిర్‌పోర్ట్‌లో దింపి ఇంటికి బయలుదేరారు. ఆ క్రమంలో బైక్‌పై వచ్చిన దుండగులు ఆయన వాహనానికి అడ్డంగా నిలిపారు. అనంతరం వారి మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. దుండగులు వారి వద్ద ఉన్న తుపాకీతో అరవింద్‌పై పలుమార్లు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... అరవింద్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతి చెందాడని వైద్యులు దృవీకరించారు. ఘటన స్థలంలో .32 ఖాళీ షెల్ స్వాధీనం చేసుకున్నామని వారణాసి రూరల్ ఎస్పీ ఏకే పాండే తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఎవరోఒకరు హత్యకు గురవుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది లేదని విజయ్ బహదూర్ పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి సమీపం బంధువు అరవింద్ సింగ్ పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. -
ఆరుగురు కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు చుక్కెదురు
నియామకం చెల్లదు.. క్యాట్ సంచలన తీర్పు సాక్షి, హైదరాబాద్: పదోన్నతుల(కన్ఫర్డ్) ద్వారా ఐఏఎస్‌లుగా నియమితులైన ఆరుగురు అధికారులకు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)లో చుక్కెదురైంది. కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా నియమితులైన ఎన్.సత్యనారాయణ, సి.శ్రీధర్, ఎ.మహ్మద్ ఇంతియాజ్, ఎం.ప్రశాంతి, పి.కోటేశ్వరరావు, అరవింద్సింగ్ల నియామకం చెల్లదని క్యాట్ స్పష్టం చేసింది. అంతేగాక 2013 సంవత్సరానికి పదోన్నతులద్వారా ఆరు ఐఏఎస్ పదవుల భర్తీకి 30 మందితో రూపొందించిన జాబితాను రద్దు చేసింది. తాజాగా జాబితాను రూపొందించి రెం డు నెలల్లో ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బి.వి.రావు, రంజనా చౌదరిలతో కూడిన క్యాట్ ధర్మాసనం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. వార్షిక నివేది కలు అందలేదన్న కారణంతో అన్ని అర్హతలున్న తమ పేర్లను కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులకోసం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ ఐ.శ్రీనగేష్, మరో 23 మంది క్యాట్‌లో పిటిషన్లు వేశారు. వీటిపై సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్ బుధవారం తీర్పునిచ్చింది. ఏసీఆర్ అందలేద న్న కారణంతో 22 శాఖలకు చెందినవారి పేర్లను కన్ఫర్డ్ ఐఏఎస్‌ల జాబితాలో చేర్చకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. జాబితాతోపాటు ఆరుగురు కన్ఫర్డ్ ఐఏఎస్‌ల నియామకం చెల్లదని పేర్కొం ది. అంతేగాక ప్రభుత్వానికి జరిమానా విధిం చింది. ఒక్కో పిటిషనర్‌కు ఖర్చుల కింద రూ.25 వేలు చొప్పున చెల్లించాలని ఆదేశించింది.