మల్టీస్టారర్‌లో హీరోగా..! | Jagapathi Babu Multi Satrrer In Tamil With Action King Arjun | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 8 2018 10:45 AM | Last Updated on Sat, Sep 8 2018 10:45 AM

Jagapathi Babu Multi Satrrer In Tamil With Action King Arjun - Sakshi

విలన్‌గా టర్న్‌ అయిన తరువాత ఫుల్‌ బిజీ అయిన సీనియర్ యాక్టర్‌ జగపతి బాబు, అడపాదడపా హీరోగానూ ఆకట్టుకున్నే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల పటేల్‌ సర్‌ సినిమాలో హీరోగా నటించిన జగ్గుభాయ్‌ త్వరలో ఓ బహుభాషా చిత్రంలో హీరోగా నటించనున్నాడట. కొత్త దర్శకుడు అన‍్బరసన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్‌, జాకీష్రాఫ్‌లు కూడా హీరోలుగా నటిస్తున్నారట.

మరో కీలక పాత్రలో ఓ స్టార్‌ హీరో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై వినాయకచవితి రోజు అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 13 సినిమాల్లో నటిస్తున్నారు ఫుల్‌ బిజీగా ఉన్నారు జగపతిబాబు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement