
కల్యాణి ప్రియదర్శన్
భారీ నౌక ప్రయాణానికి సిద్ధమయ్యారు కల్యాణి ప్రియదర్శన్. ఈ ప్రయాణం చాలా ప్రత్యేకమైంది కూడా. మరి ఈ ప్రయాణం విశేషాలేంటో తెలుసుకోవాలంటే ‘కుంజలీ మరక్కార్’ చిత్రం చూడాల్సిందే. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. మోహన్‌లాల్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్, కీర్తీ సురేశ్, ప్రణవ్ మోహన్‌లాల్, కల్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ టైమ్ తండ్రి దర్శకత్వంలో నటిస్తున్నారు కల్యాణి ప్రియదర్శన్. అందుకే ఈ సినిమా తనకు స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ షూట్‌లో శనివారం జాయిన్ అయ్యారు కల్యాణి. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.