మీటూ...పై మాట మార్చిన నటుడు ప్రకాశ్‌ రాజ్‌ | Prakash Raj Change Words On Metoo Movement | Sakshi
Sakshi News home page

మీటూ...పై మాట మార్చిన నటుడు ప్రకాశ్‌ రాజ్‌

Published Fri, Oct 26 2018 11:55 AM | Last Updated on Fri, Oct 26 2018 11:55 AM

Prakash Raj Change Words On Metoo Movement - Sakshi

ప్రకాశ్‌ రాజ్, మంత్రి జయమాలా

కర్ణాటక, యశవంతపుర : అర్జున్‌పై మీటూ ఆరోపణలు చేసిన శ్రుతి హరిహరన్‌ చేసిన వ్యాఖ్యలపై బహుభాష నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మాటమార్చారు. తాను ఆయన నిందితుడంటూ ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదని ట్విట్టర్‌లో స్పందించగా మంత్రి జయమాల కూడా స్పందించారు. శ్రుతి ఆరోపించినట్లు అర్జున్‌ అలాంటి వ్యక్తి కాదన్నారు.

మాటమార్చిన ప్రకాశ్‌ రాజ్‌
నటుడు అర్జన్‌పై నటి శ్రుతి హరిహరన్‌ చేసిన మీటూ ఆరోపణలపై మొదట శ్రుతిహరిహరన్‌ తరపున నిలబడిన నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మాట మార్చారు. అందులో అర్జున్‌ నిందితుడంటూ ఆరోపణలు చేయలేదని స్పష్టం చేశారు. ఆయన ట్విట్టర్‌ ద్వారా తనకు అర్జున్‌ మంచి స్నేహితుడని, సినీ రంగంలో తన సహ నటుడని, అతడిని చాలా దగ్గర నుంచి చూశానని, అయితే శ్రుతి ఆరోపణలు నేపథ్యంలో ఇద్దరి ఒక వేదికపై పిలిచి సమస్య పరిష్కరించాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మీటూ దుర్వినియోగం కాకూడదు : నటి, మంత్రి జయమాలా
మీటూ వేదికను దుర్వినియోగం చేసుకోకూడదని కన్నడ సంస్కతిశాఖ మంత్రిఇ జయమాలా అన్నారు. ఇదీ మహిళలకు ఇది ఒక బలమైన వేదిక అని అన్నారు. గురువారం ఆమె లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బైందూరు తాలూకా నాగూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆధార రహిత మాటలను పత్రికల ముందు నిలబడి చెప్పటం సరికాదన్నారు. నటుడు అర్జున్‌ మంచి నటుడని అమె సమర్థించుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement