
మీటూ ప్రకంపనలు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. హాలీవుడ్‌లో మొదలై బాలీవుడ్‌లో తారస్థాయికి చేరుకుంటున్న ఈ ఉద్యమంలో తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ పేరు రావడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అర్జున్ కూడా సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అయితే ఇదే విషయంపై మరో హీరోయిన్ స్పందించారు.
అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాంట్రాక్ట్’లో నటిస్తున్న సోనీ చరిష్టా ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. తనతో నటించే హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణని నమ్మలేకపోతున్నానని, కాంట్రాక్ట్ అనే చిత్రంలో ఆయనతో కలిసి నటించానని, ఆయన అసలుసిసలు జెంటిల్‌మెన్ అని అన్నారు. ‘మీ టూ’ మెల్లగా పక్కదారి పడుతుందేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అర్జున్, సోనీ చరిష్టా నటించిన కాంట్రాక్ట్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment