డైరెక్టర్స్ రొమాంటిక్ హీరోయిన్‌గానే చూస్తారుహాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లండన్‌కు చెందిన బోల్డ్ అండ్ బ్యూటీ మోడలింగ్ రంగంలో రాణిస్తూ దర్శకుడు ఎంఎల్ విజయ్ దృష్టిలో పడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన మదరాసు పట్టణం చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఆ తరువాత రజినీకాంత్, విజయ్, విక్రమ్, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించి భారతీయ సినీ నటిగా గుర్తింపు పొందారు. అలాంటిది ఆ తరువాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో లండన్‌కు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ వెబ్‌సీరీస్‌లో నటించారు.
అలాంటి పరిస్థితుల్లో తనను కథానాయకిగా పరిచయం చేసిన దర్శకుడు ఏఎల్ విజయ్ మళ్లీ అమీజాక్సన్‌ను కోలీవుడ్‌కు తీసుకొచ్చారు. ఆమె నటించిన తాజా చిత్రం మిషన్ చాప్టర్–1. అరుణ్‌విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లైకా పొడక్షన్ సంస్థ నిర్మించింది. పొంగల్ సందర్భంగా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో అమీజాక్సన్ లండన్‌కు చెందిన పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా నటించడం విశేషం.
అయితే అనారోగ్యంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన ఆమె మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. దర్శకుడు విజయ్ తన చిత్రాల్లో పాత్రలను శక్తివంతంగా రూపొందిస్తారన్నారు. ఎంతగా అంటే.. ఎన్నేళ్లయినా కూడా ఆ పాత్రలు అలా గుర్తుండిపోతాయన్నారు. అలాంటి దర్శకుడి ద్వారా మదరాసు పట్టణం చిత్రంతో తాను హీరోయిన్‌గా పరిచయం అవడం తన అదృష్టమని అన్నారు. మిషన్ చాప్టర్ –1 చిత్రంలో తాను చాలా ముఖ్యమైన పాత్రను పోషించినట్లు చెప్పారు. చాలా మంది దర్శకులు తనను రొమాంటిక్ హీరోయిన్‌గానే చూస్తారని.. అందువల్ల తనకు యాక్షన్ కథాపాత్రలు వస్తాయని ఊహించలేదన్నారు. అలాంటిది దర్శకుడు తనకు యాక్షన్ హీరోయిన్‌గా చూపించారని చెప్పారు. ఈ చిత్రం తన సినీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం తనకు ఉందని అమిజాక్సన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment