జెంటిల్‌మేన్‌ 2 | Producer KT Kunjumon announces the sequel Gentleman 2 | Sakshi
Sakshi News home page

జెంటిల్‌మేన్‌ 2

Published Fri, Sep 11 2020 6:39 AM | Last Updated on Fri, Sep 11 2020 6:39 AM

Producer KT Kunjumon announces the sequel Gentleman 2 - Sakshi

కేటీ కుంజుమోన్‌

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హీరోగా శంకర్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ కేటీ కుంజుమోన్‌ నిర్మించిన చిత్రం ‘జెంటిల్‌మేన్‌’. 1993లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు దేశవ్యాప్తంగా శ్రోతలను అలరించాయి. ఈ సినిమా విడుదలైన 27ఏళ్లకు ‘జెంటిల్‌మేన్‌2’ చిత్రాన్ని నిర్మించనున్నట్లు నిర్మాత కేటీ కుంజుమోన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘జెంటిల్‌మేన్‌’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అనువదించిన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన రాబట్టుకుంది. తొలి భాగానికి రెండింతలు గొప్పగా ‘జెంటిల్‌మేన్‌ 2’ని  తెరకెక్కించనున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్‌ చిత్రాలకు దీటుగా ఈ సినిమాని రూపొందిస్తాం. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జెంటిల్‌మేన్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement