సంయుక్తంగా అగ్రస్థానంలో అర్జున్‌ | Telangana Chess Grand Master Arjun Top Lead In National Chess Championship | Sakshi
Sakshi News home page

సంయుక్తంగా అగ్రస్థానంలో అర్జున్‌

Mar 3 2022 2:15 PM | Updated on Mar 3 2022 2:17 PM

Telangana Chess Grand Master Arjun Top Lead In National Chess Championship - Sakshi

జాతీయ సీనియర్‌ పురుషుల చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్, తమిళనాడు గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌ 8 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. కాన్పూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పదో రౌండ్‌లో అర్జున్‌ 41 ఎత్తుల్లో ఇనియన్‌ (తమిళనాడు)తో ‘డ్రా’ చేసుకోగా... గుకేశ్‌ 64 ఎత్తుల్లో అభిజిత్‌ గుప్తా (పీఎస్‌పీబీ)పై గెలిచాడు. నేడు చివరిదైన 11వ రౌండ్‌ గేముల్లో సేతురామన్‌ (పీఎస్‌పీబీ)తో అర్జున్, ఆర్యన్‌ చోప్రా (ఢిల్లీ)తో గుకేశ్‌ ఆడతారు.

Advertisement
 
Advertisement
Advertisement