హార్ట్ బ్రేకింగ్‌.. ఒకే ఒక్క పాయింట్‌! తృటిలో చేజారిన ప‌త‌కం | Heartbreak for Arjun Babuta, narrowly misses out on a medal | Sakshi
Sakshi News home page

Paris Olympics: హార్ట్ బ్రేకింగ్‌.. ఒకే ఒక్క పాయింట్‌! తృటిలో చేజారిన ప‌త‌కం

Jul 29 2024 4:33 PM | Updated on Jul 29 2024 5:15 PM

Heartbreak for Arjun Babuta, narrowly misses out on a medal

ప్యారిస్ ఒలింపిక్స్ షూటింగ్‌లో భార‌త్‌కు తృటిలో మరో పతకం చేజారింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో భారత షూటర్ అర్జున్ బాబుటా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైన‌ల్ పోరులో ప‌త‌కానికి 1.1 పాయింట్ దూరంలో అర్జున్ నిలిచిపోయాడు.

ఓ ద‌శ‌లో గోల్డ్‌మెడల్ రేసులో ఉన్న అర్జున్ ఒత్త‌డిలో త‌ప్పిదాలు చేస్తూ 208.4 పాయింట్ల‌తో నాలుగో స్ధానానికి ప‌డిపోయాడు. క్రొయేషియా షూట‌ర్ మిరాన్ మారిసిచ్ 209.3 పాయింట్లతో మూడో స్ధానంలో నిలిచి కాంస్య ప‌త‌కం సొంతం చేసుకున్నాడు.

ఇక 231.1 పాయింట్ల‌తో అగ్ర‌స్ధానంలో నిలిచిన చైనా షూట‌ర్ షెంగ్ లిహావోకు గోల్డ్ మెడ‌ల్‌, 230.5 పాయింట్ల‌తో రెండో స్ధానంలో నిలిచిన జర్మనీ షూట‌ర్ విక్టర్ లిండ్‌గ్రెన్  సిల్వ‌ర్ మెడ‌ల్ ద‌క్కింది. మ‌రోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో కూడా భార‌త్‌కు నిరాశే ఎదురైంది. ఫైన‌ల్స్‌లో భార‌త షూట‌ర్ రమితా జిందాల్ ఏడో స్ధానంతో స‌రిపెట్టుకుంది. దీంతో ఒలింపిక్ ప‌త‌కాన్ని సాధించే అవ‌కాశాన్ని రమితా జిందాల్ కోల్పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement