సచిన్ టీజర్ వచ్చేసింది! | sachin movie teaser released | Sakshi
Sakshi News home page

సచిన్ టీజర్ వచ్చేసింది!

Published Thu, Apr 14 2016 1:56 PM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

సచిన్ టీజర్ వచ్చేసింది!

సచిన్ టీజర్ వచ్చేసింది!

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ స్వయంగా నటించిన ఆయన బయోపిక్ టీజర్ వచ్చేసింది. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ టీజర్‌ను స్వయంగా సచిన్ టెండూల్కర్ నుంచి ఈ సినిమాకు సంగీతం అందించిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్.. ఇలా చాలామంది రీట్వీట్ చేశారు. ఈ టీజర్‌లో చిన్నతనంలో సచిన్ తన తండ్రి వేలు పట్టుకుని వెళ్లడం, తొలిసారి బ్యాట్ పట్టుకున్న ఆనందం, అన్నతో కలిసి ఆడటం, స్కూల్లో తోటి పిల్లలతో కొట్లాటలు.. ఇవన్నీ ముందు కనిపిస్తాయి. తర్వాత బీచ్ ఒడ్డున తనకు ఎంతో ఇష్టమైన నీలిరంగు షర్టు వేసుకున్న సచిన్ కనిపిస్తాడు.

ఆ తర్వాత మళ్లీ హెల్మెట్ పెట్టుకుని గ్రౌండులోకి వెళ్లడం, మిడిల్ వికెట్ మీద నాణెం పెట్టి ఆడటం, ఒళ్లంతా మూడు జెండా రంగులను పులుముకుని జెండా ఊపుతూ కనిపించే సచిన్ వీరాభిమాని.. ఇవన్నీ కూడా టీజర్‌లో జోడించారు. మధ్యలో తన తండ్రి చెప్పిన సందేశాన్ని కూడా సచిన్ వినిపించాడు. ''మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు.. నువ్వు క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నావు. కానీ అది నీ జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ ఏదో ఒకటి మాత్రం శాశ్వతంగా నీతో ఉండిపోతుంది అది.. నీ వ్యక్తిత్వం'' అని సచిన్ టెండూల్కర్ చెప్పడం కూడా ఈ టీజర్‌లో కనిపిస్తుంది. మొత్తమ్మీద మైదానంలోనే కాదు వెండితెర మీద కూడా అభిమానులను అలరించేందుకు సచిన్ టెండూల్కర్ సిద్ధమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement