- బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి
రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉంది
Published Wed, Aug 3 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
నర్సంపేట : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర చాలా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈనెల 7న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే సమ్మేళన సభను విజయవంతం చేయాలని కోరుతూ ముద్రించిన వాల్‌పోస్టర్లను మంగళవారం ఆ యన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం వివక్షత లేకుండా వేలాది కోట్లు మంజూరు చేసి నిరూపించుకుంటుందన్నారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రు లు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బహిరంగ సభకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు వడ్డెపల్లి నర్సింహరాములు, పట్టణ అధ్యక్షుడు టాకరాజు, మండల అధికార ప్రతినిధి కల్వచర్ల ప్రవీణ్‌చారి, త్రిలోకేశ్వర్, రేసు శ్రీనివాస్, కూనమళ్ళ పృథ్వీరాజ్, సూత్రపు సరిత, గాదె రాజ్‌కుమార్, నూనె రంజిత్, లకన్, ప్రదీప్, సాయికిరణ్ పాల్గొన్నారు.
మంత్రి పదవికి కడియం రాజీనామా చేయాలి : అశోక్‌రెడ్డి
కేసముద్రం : ఎంసెట్–2 లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూlవిద్యాశాఖ, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెంటనే మంత్రిపదవికి రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశాఖమంత్రిగా ఉన్న రాజయ్య ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడో చెప్పకుండానే, అతన్ని మంత్రి పదవి నుంచి ప్రభుత్వం తొలగించిందన్నారు. అలాంటిది ఎంసెట్2 లీకేజీతో 60 వేల మంది విద్యార్థుల జీవితాలు ఆగమయ్యాయన్నారు. కోట్లల్లో జరిగిన ఈ అవినీతి బట్టబయలైనప్పటికీ ఎందుకు ఈ ప్రభుత్వం మంత్రి పదవి నుంచి కడియంను తొలగించలేదని ప్రశ్నించారు. తిగిరి ఎంసెట్–3 పరీక్షలను నిర్వహిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈనెల 7న హైదరాబాద్‌లో బీజేపీ బూత్ కమిటీ సభ్యుల మహాసమ్మేళనం నిర్వహిస్తున్నామని, ఇందుకు ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్నారన్నారు. జిల్లానుండి 10 వేల మంది ఈ కార్యక్రమానికి హజరుకానున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement