ప్రభాస్ కల్కి.. అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్! | Prabhas latest Movie Kalki 2898AD Role Revealed Today | Sakshi
Sakshi News home page

Kalki 2898AD: ప్రభాస్ కల్కి..ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్!

Published Fri, Mar 8 2024 6:54 PM | Last Updated on Fri, Mar 8 2024 7:35 PM

Prabhas latest Movie Kalki 2898AD Role Revealed Today - Sakshi

సలార్‌ తర్వాత వస్తోన్న ప్రభాస్‌ మరో చిత్రం 'కల్కి 2989 ఏడీ'. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్‌ వచ్చేసింది. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె నటిస్తోంది.  కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలో ప్రభాస్‌ క్యారెక్టర్‌ పేరును రివీల్ చేశారు మేకర్స్. 

ఈ చిత్రంలో ప్రభాస్.. భైరవగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ పోస్టర్‌ను షేర్ చేస్తూ రివీల్ చేశారు. కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

కాగా..ఈ సినిమాలో  టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అయిన రాజేంద్ర ప్రసాద్‌ కూడా నటిస్తున్నారు. ప్రభాస్‌తో ఆయన తొలిసారి నటిస్తున్నారు. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్‌ చెప్పారు. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్‌ పెట్టామని నాగ్‌ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement