![Prabhas Role Revealed In Spirit Movie By Bhushan Kumar - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/4/spirit.jpg.webp?itok=37Fvg80F)
Prabhas Role Revealed In Spirit Movie: ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్‌లో తెరంగ్రేటం చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అప్పటినుంచి ఏ మూవీ తెరకెక్కిన పాన్ పాన్ ఇండియా చిత్రంగానే చేస్తున్నాడు. ఇలా వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు ఈ మిస్టర్ పర్‌ఫెక్ట్. అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా రాధేశ‍్యామ్ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ చేసిన ట్వీట్‌తో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే ఆదిపురుష్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న మిర్చీ హీరో ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు డార్లింగ్.
ఇక ఈ సినిమా తర్వాత సెట్స్ మీదకు వెళ్లేది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ మూవీ. అర్జున్ రెడ్డితో సూపర్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డితో ప్రభాస్ సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా సినిమా టైటిల్ మరింత హైప్ పెంచేలా ఉంది. వీటన్నిటికి తోడు ఈ సినిమా గురించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించేలా ఉంది. అదేంటంటే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫిసర్‌గా కనిపించబోతున్నాడట. ఈ విషయాన్ని ఆదిపురుష్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ ప్రభాస్ పోలీసు పాత్రలో నటించలేదు. కానీ అభిమానులు మాత్రం ఆ రోల్‌లో తమ డార్లింగ్‌ను చూసుకోవాలని ఎప్పటినుంచో ఆరాటపడుతున్నారు. ఒకవేళ భూషణ్ కుమార్ చెప్పిందే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇంతకుమించిన ఆనందం ఇంకొకటి ఉండదని చెప్పుకోవచ్చు.
ఇదీ చదవండి: రాధేశ్యామ్ చిత్రానికి తమన్ బీజీఎం.. అందుకోసమేనా ?
Comments
Please login to add a commentAdd a comment