ఎన్టీఆర్ సినిమాలో 'అత్త'గా రీఎంట్రీ | Actress Devayani to make Tollywood comeback with Jr NTR 'Janatha Garage' | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ సినిమాలో 'అత్త'గా రీఎంట్రీ

Published Mon, Feb 8 2016 5:53 PM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

ఎన్టీఆర్ సినిమాలో 'అత్త'గా రీఎంట్రీ - Sakshi

ఎన్టీఆర్ సినిమాలో 'అత్త'గా రీఎంట్రీ

ఒకప్పటి హీరోయిన్ పన్నెండేళ్ల తరువాత తిరిగి తెలుగు తెరపై కనిపించనున్నారు. పవన్ కల్యాణ్ 'సుస్వాగతం' సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన దేవయాని.. తక్కువ కాలంలోనే తెలుగు తెరకు కనుమరుగయ్యారు. అడపాదడపా తమిళ్ డబ్బింగ్ సీరియల్స్ లో కనిపించడం మినహా వెండితెరపై మెరిసింది తక్కువే. 12 ఏళ్ల క్రితం మహేష్ బాబు 'నాని' సినిమాలో తల్లి పాత్రలో మెప్పించిన దేవయాని ఆ తరువాత అసలు తెలుగులో నటించనేలేదు. చెన్నైలో ఓ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వహిస్తూ సాధారణ జీవితానికి పరిమితమయ్యారు.

అయితే తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఏన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'జనతా గ్యారేజ్' సినిమాలో దేవయాని నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ లాల్ కు జతగా కనిపించనున్నారు. ప్రాధాన్యమున్న పాత్ర కావడంతోనే దేవయాని అంగీకరించారని యూనిట్ తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్కు అత్తగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ మెకానిక్గా పని చేస్తూనే చదువు కొనసాగించే స్టూడెంట్గా కనిపించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement