
నటి కాజల్ అగర్వాల్ (పాత చిత్రం)
మీడియాల్లో వచ్చే వార్తల్లో ఏది వాస్తవమో.. ఏది అబద్ధమో స్వయంగా సెలబ్రిటీలే స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా నటి కాజల్ అగర్వాల్ తనపై వస్తున్న ఓ వార్తపై స్పందించారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆమె జయలలిత పాత్రను పోషించబోతుందన్న వార్త ఒక్కటి గత కొన్ని రోజులుగా వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వార్త నిజం కాదని ఆమె వివరణ ఇచ్చారు.
‘ఎన్టీఆర్ బయోపిక్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. జయలలిత పాత్ర పోషిస్తున్నానన్న వార్తలో నిజం లేదు’ అని కాజల్ స్పష్టత ఇచ్చారు. దీంతో ఈ చిత్రంలో ఈ పాత్ర ఎవరు పోషించబోతున్నారన్న దానిపై ఆసక్తి మొదలైంది. మరోపక్క ఈ చిత్రంలో బాలకృష్ణ తప్ప.. మిగతా పాత్రలేవీ ఇంకా ఖరారు చేయలేదని చిత్ర యూనిట్ ప్రకటించినా రోజుకో వార్త వినిపిస్తోంది. దిగ్గజ నటుడు, దివంగత నేత ఎన్టీఆర్ జీవితగాథగా ఎన్టీఆర్ చిత్రాన్ని దర్శకుడు తేజ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తుండగా.. సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉంది. దసరాకి ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment