
సీతారాం ఏచూరి
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్లీ మరో పదేళ్లు ప్రతిపక్షంలో ఉంటారని సీపీఎం పోలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు.
విజయవాడ: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్లీ మరో పదేళ్లు ప్రతిపక్షంలో ఉంటారని సీపీఎం పోలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారని, మళ్లీ పొత్తుతో మరో 10 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటారన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హవా అనేది మీడియా స్పష్టేనన్నారు. దేశంలో మోడీ హవా ఉంటే ఆయన రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తారు? అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాతే తృతీయ ఫ్రంట్‌పై నిర్ణయం జరుగుతుందని సీతారాం ఏచూరి చెప్పారు.