నేడు నగరానికి వైఎస్ జగన్ రాక
-
బలిరెడ్డి మనమరాలి వివాహానికి హాజరు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విశాఖ నగరానికి రానున్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బలిరెడ్డి సత్యారావు మనమరాలు బిందు మౌనిక వివాహం నగరంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్(ఆంకోసా) హాలులో గురువారం జరగనుంది. ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. రాత్రి 7.45 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు.