Indian Origin Vivek Ramaswamy May Join US Presidential Race - Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి వివేక్ రంగస్వామి!

Published Sat, Feb 18 2023 12:35 PM | Last Updated on Sat, Feb 18 2023 1:07 PM

Indian Origin Vivek Ramaswamy May Join Us Presidency Race - Sakshi

వాషింగ్టన్‌: 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో నిక్కీ హేలీ, మైక్ పాంపియో, మైక్ పెన్స్ వంటి హేమా హేమీలు పోటీలో ఉండబోతున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరంతా డొనాల్డ్ ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి చెందినవారే. అయితే తాజాగా మరో యువ పారిశ్రామికవేత్త పేరుకూడా గట్టిగా వినపడుతోంది. భారత సంతతికి చెందిన 37 ఏళ్ల వివేక్ రామస్వామికి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడే అవకాశం ఉందని చాలా మంది చెబుతున్నారు. ఈయన కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన వారే గమనార్హం.

శాకాహారి అయిన వివేక్ రంగస్వామి వ్యాపారవేత్తగానే గాక.. ఇన్వెస్టర్‌గా గుర్తింపుపొందారు. బయోఫార్మాసూటికల్ కంపెనీ 'రోయివంట్ సైన్సెస్‌'కు వ్యవస్థాపక సీఈఓ. వోకిఇజం, సోషల్లీ రెస్పాన్సిబుల్ ఇన్వెస్టింగ్‌పై తన అభిప్రాయాలు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. అమెరికా ప్రముఖ మేగజీన్ 'ది న్యూయార్కర్‌'.. వివేక్ రంగస్వామిని 'యాంటీ-వోక్ సీఈఓ'గా అభివర్ణించింది.

వోక్‌యిజం అంటే సామాజికంగా, రాజకీయంగా అందరీ న్యాయం జరగడం లేదని బాధపడే సున్నిత మనస్తత్వం లేదా భావజాలం. అయితే వోకియిజం పిడివాద భావజాలం అని వివేక్ వాదిస్తుంటారు. ఇది ప్రపంచంలోని వాస్తవ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం కంటే సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంపైనే ఎక్కువ ఆసక్తి కలిగిఉందని చెబుతుంటారు. అందుకే ఈయనను 'యాంటీ-వోక్ సీఈవో' అని న్యూ యార్కర్ అభివర్ణించింది.

రాజకీయంగా వివేక్‌కు ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికి రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయన అధ్యక్ష రేసులో నిలబడేందుకు సరైన అభ్యర్థి అని చాలా మంది భావిస్తున్నారు. అయితే వివేక్ అభ్యర్థిత్వాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రెసిడెన్సీకి వ్యాపార ఆధారిత విధానాన్ని తీసుకురాగల సరికొత్త వ్యక్తిగా అతడ్ని కొందరు చూస్తున్నారు.

మరికొందరేమో అతనికి ఏ మాత్రం రాజకీయ అనుభవం లేదని, వోకియిజంపై అతని ఆలోచనలు వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా.. ఒకవేళ వివేక్ రంగస్వామికి అమెరికా అభ్యర్థిగా నిలబడే అవకాశం లభిస్తే మాత్రం అది ప్రతి భారతీయుడికి గర్వకారణంగా చెప్పొచ్చు.
చదవండి: ట్రంప్‌కు షాక్ ఇస్తున్న రిపబ్లికన్లు.. అధ్యక్ష ఎన్నికల్లో సవాల్.. నమ్మినవాళ్లే వ్యతిరేకులుగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement