యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్, రాస్ అల్ ఖైమాలో జరిగిన చిన్న ప్రైవేట్ విమాన ప్రమాదంలో 26 ఏళ్ల భారత సంతతికి వైద్యుడు సులేమాన్ అల్ మాజిద్ దుర్మరణం పాలయ్యారు. యూఏఈలోని రస్ అల్ ఖైమా తీరంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్, కోపైలట్ ఇద్దరూ చనిపోయారని యుఎఇ ప్రభుత్వ విభాగమైన జెనెరల్ సివిల్ ఏమియేషన్ అథారటీ ధృవీకరిస్తూ ప్రకటన జారీ చేసింది.
చనిపోయిన ఇద్దరిలో 26 ఏళ్ల పాకిస్థానీ మహిళ కాగా మరొకరు సులేమాన్ అల్ మాజిద్. ఇతను విమానంలో కోపైలట్‌గా ఉన్నాడు. సులేమాన్ దుబాయ్‌లోనే పుట్టి పెరిగాడు. విమానాన్ని అద్దెకు తీసుకున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. బెంగుళూరుకి చెందిన ఇతని కుటుంబం యూఏఈ దేశానికి వలస వెళ్లింది. యూకే దేశంలోని డుర్హాం కౌంటీ, డార్లింగ్టన్ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్‌లో ఫెలో డాక్టర్‌గా ఉద్యోగం చేసేవాడు. బిట్రీష్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా, హానరరీ సెక్రటరీ, నార్తరన్ రెసిడెంట్ డాక్టర్స్ కమిటీలో కో-చైర్మన్ పదవులు చేపట్టాడు. అలాగే యూకేలో డాక్టర్‌గా ఉన్న సమయంలోజూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల వేతనం పెంచాలని ఉద్యమం చేసినట్టు సోషల్‌మీడియా ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది.
సులేమాన్ తన కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరాన్ని సరదాగా కొంత సమయం గడిపాడు. ఆ తరువాత తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి ఒక ప్రైవేట్ ఏమియేషన్ క్లబ్ కు వెళ్లాడు. అక్కడ ముందుగా సులేమాన్ సరదాగా గాల్లో విహరించేందుకు క్లబ్ విమానంలో వెళ్లాడు. పైలట్ ఒక పాకిస్తానీ మహిళ ఉన్నారు. అయితే వీరి విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే కాంటాక్ట్ మిస్ అయింది. కోవ్ రొటానా హోటల్ సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. తీవ్ర గాయాలైన ఇద్దరినీ ఆస్పత్రి తరలించారు. కానీ ఇద్దరూ చనిపోయారు.
సులేమాన్ అకాల మరణంపై తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకుతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో ఉన్నాం. త్వరలోనే అతడికి పెళ్లి కూడా చేయాలనుకున్నాం. కానీ ఇంతలోనే అతను మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. తమకు సర్వస్యం అయిన సులేమాన్ లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment