ఫిలిప్పీన్స్‌లో భారతీయుడి కాల్చివేత | Indian killed in Philippines ambush | Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్‌లో భారతీయుడి కాల్చివేత

Sep 26 2013 1:24 AM | Updated on Sep 1 2017 11:02 PM

ఫిలిప్పీన్స్‌లో దుండగులు జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. బటాక్ నగరంలో నివసించే జశ్వీందర్‌సింగ్ (38) మంగళవారం కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై తుపాకులతో కాల్పులు జరిపారు.

మనీలా: ఫిలిప్పీన్స్‌లో దుండగులు జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. బటాక్ నగరంలో నివసించే జశ్వీందర్‌సింగ్ (38) మంగళవారం కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ సమయంలో జశ్వీందర్ సోదరుడు అమరీందర్‌సింగ్ కూడా కారులోనే ఉన్నారు. మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు జశ్వీందర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా బుల్లెట్ గాయాలైన అతనిని బాటిక్ నగరంలోని ఒక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు చెప్పారు. అమరీందర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement