ఫిలిప్పీన్స్లో గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయుడు మరణించగా, మరొకరు సురక్షితంగా బయటపడ్డాడు.
ఫిలిప్పీన్స్లో గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయుడు మరణించగా, మరొకరు సురక్షితంగా బయటపడ్డాడు. జస్వీందర్ సింగ్ (38) అనే వ్యక్తి బటాక్ నగరంలో నివసిస్తున్నాడు. మంగళవారం ఆయన తన సమీప బంధువు అమరీందర్ సింగ్తో కలసి బటాక్ నుంచి ఇలోకస్ సర్ రాష్ట్రానికి కారులో బయల్దేరాడు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా మోటార్ సైకిల్పై వచ్చిన ఓ అగంతకుడు వారిపై కాల్పులు జరిపినట్టు ఫిలిప్పీన్స్ మీడియా వెల్లడించింది.
ఈ సంఘటనలో అమరీందర్ సురక్షితంగా తప్పించుకోగా, జస్వీందర్ తీవ్రంగా గాయపడ్డాడు. జస్వీందర్ శరీరంలోకి చాలా బులెట్లు దూసుకెళ్లాయి. చికిత్స కోసం ఆయనను బటాక్కు తరలించినా ఫలితం లేకపోయింది. జస్వీందర్ అప్పటికే మరణించినట్టు వైద్యలు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.