Jaswinder Singh
-
లుథియానా కోర్టు పేలుడు కేసు... జర్మనీలో సూత్రధారి పట్టివేత
న్యూఢిల్లీ: లూథియానా జిల్లా కోర్టులో సంభవించిన బాంబు పేలుడు దర్యాప్తులో లోతుల్లోకి వెళ్లి కూపీ లాగిన భారత దర్యాప్తు సంస్థలు సూత్రధారిని పట్టుకోవడంలో సఫలమయ్యాయి. వేర్పాటువాద కార్యకలాపాలను ప్రోత్సహించే సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ఐ) సంస్థకు చెందిన ఉగ్రవాది జస్విందర్ సింగ్ ముల్తానీని భారత నిఘా వర్గాల సమాచారంతో జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23న లూథియానా కోర్టు రెండో అంతస్తులో బాంబు పేలిన విషయం తెల్సిందే. మాజీ కానిస్టేబుల్ గగన్‌దీప్ బాంబును అమర్చుతుండగా పేలి అతను మరణించాడు. ఎన్నికల వేళ పంజాబ్‌లో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు పాకిస్తాన్ గడ్డపై నుంచి ఖలిస్థాన్ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలియడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు దీన్ని సీరియస్‌గా తీసుకొన్నాయి. గగన్‌దీప్... జస్విందర్ సింగ్ ముల్తానీతో నిరంతరం సంప్రదింపులు జరిపాడని గుర్తించాయి. దాంతో ఇతనిపై పంజాబ్ రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. భారత్ తమ రాయబార కార్యాలయం ద్వారా జర్మనీ పోలీసులకు తగిన ఆధారాలను సమర్పించడంతో వారు ఎర్ఫర్ట్ పట్టణంలో ముల్తానీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని పేలుడు పదార్థాలు, హ్యాండ్ గ్రెనేడ్లను పాక్ మీదుగా భారత్‌లోకి పంపే ప్రయత్నాల్లో ముల్తానీ ఉన్నాడని, పంజాబ్‌లో మళ్లీ పేలుళ్లకు కుట్ర చేస్తున్నాడని భారత ఏజెన్సీలు గుర్తించాయి. ఖలిస్థానీ అగ్రనేతలతో ముల్తానీకి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. -
ప్రముఖ గ్యాంగస్టర్ కాల్చివేత
చండీగడ్ కు చెందిన గ్యాంగస్టర్, అక్రమ ఆయుధాల కేసులో నిందితుడు జస్విందర్ సింగ్ అలియాస్ రాకీ హత్యకు గురయ్యాడు. గ్యాంగస్టర్ నుంచి రాజకీయవేత్తగా మారిన రాకీని శనివారం పర్వనూ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. హిమాచల్ ప్రదేశ్ కు విహార యాత్రకు వెళ్లిన రాకీ సిమ్లా నుంచి చండీగఢ్ కు తిరిగి వస్తుండగా హత్యకు గురయ్యాడు. అతని ప్రత్యర్థి ముఠా సభ్యులు ఈ ఘటనకు బాధ్యులని పోలీసులు అనుమానిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లా పర్వానూ లో దుండగులు కాల్చి చంపారు. సోలన్ ఎస్పీ అంజుం అలా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఐజీ జైదీ అందించిన వివరాల ప్రకారం ముష్కరులు రాకీపై అతి సమీపంనుంచి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అక్కడిక్కడే చనిపోయాడు. అనంతరం సంఘటనా స్థలంనుంచి పారిపోయారు. ఈ ఘటనలో అతపి గన్ మెన్ కూడా గాయపడినట్టు తెలుస్తోంది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారు తెలిపారు. దుండగులు రెండు వేర్వేరు వాహనాల్లో వచ్చారన్నారు. ముష్కరులు ఇద్దరు బైక్ పై నా, మరో ఇద్దరు కారులో వచ్చినట్టు ఫాలో ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. దని తెలుస్తుంది. కారులో కూర్చున్నవారు రాకీ కాల్పులు జరిపారని, బైక్ పై వచ్చిన ఖాళీ బుల్లెట్లను తీసుకెళ్లినట్టుగా సీసీటీవీలో రికార్డైందన్నారు. నిందితులను గుర్తించామని, త్వరలోనే నిర్బంధంలోకి తీసుకుంటామని తెలిపారు. రాకీకి అనేక కరుడు కట్టిన అనేక నేరాలతో సంబంధముందని, హత్యకేసులు నమోదయ్యాయని తెలిపారు. 2006 లో చండీగఢ్ లేక్ క్లబ్ లో మరో గ్యాంగస్ట్ర్ ప్రభజిత్ సింగ్ హత్య కేసులో రాకీ హస్తం ఉందని ఆరోరపణలు, ఆకేసునుంచి నిర్దోషిగావిడుదలయ్యాడన్నారు. అలాగే పంజాబ్‌లో అనేక ముఠాలతో సంబంధాలు నెరపిన రాకీకి ఉత్తర ప్రదేశ్ లోని అనేకమంది నేరగాళ్లతో సంబంధాలున్నట్టు తెలిపారు. కాగా 2012 లో, ఫాజిల్కా నియోజవర్గంనుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాకీ గత ఏడాది అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ అయ్యాడు. -
పాలీవుడ్‌కి శక్తి కపూర్!
హిందీ చిత్రసీమలో అగ్రశ్రేణి ప్రతినాయకుల జాబితాలో కచ్చితంగా ఉండే పేరు... శక్తి కపూర్. ఆయనలో ఎంత గొప్ప విలన్ ఉన్నాడో, అంతే గొప్ప కమెడియన్ కూడా ఉన్నాడు. నాలుగు దశాబ్దాల కెరీర్లో ఉత్తర, దక్షిణాది భాషల్లో వందలాది సినిమాలకు పైగా చేశారు శక్తి. ఈ ఏడాది పాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. పాలీవుడ్ అంటే.. పంజాబీ పరిశ్రమ. జస్వీందర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ‘మేరేజ్ డా గారేజ్’ అనే చిత్రంలో శక్తి కపూర్ కీలక పాత్ర చేస్తున్నారు. జైలు నుంచి విడుదలయ్యే ఇద్దరు ఖైదీలు ‘మేరేజ్ డా గారేజ్’ అనే వ్యాపారం ప్రారంభిస్తారని, ఓ ప్రేమజంట పెళ్లికి వీళ్లెలా సహాయపడతారనేది ప్రధాన ఇతివృత్తం అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో చాలా పాత్రలు ఉంటాయని, అన్నిటికీ సమాన ప్రాధాన్యం ఉంటుందని, శక్తికపూర్ పాత్ర కామెడీ టచ్‌తో సాగుతుందని పేర్కొన్నారు. -
ఫిలిప్పీన్స్‌లో భారతీయుడి కాల్చివేత
మనీలా: ఫిలిప్పీన్స్‌లో దుండగులు జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. బటాక్ నగరంలో నివసించే జశ్వీందర్సింగ్ (38) మంగళవారం కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ సమయంలో జశ్వీందర్ సోదరుడు అమరీందర్‌సింగ్ కూడా కారులోనే ఉన్నారు. మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు జశ్వీందర్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా బుల్లెట్ గాయాలైన అతనిని బాటిక్ నగరంలోని ఒక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు చెప్పారు. అమరీందర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. -
ఫిలిప్పీన్స్‌లో భారతీయుడి కాల్చివేత
మనీలా: ఫిలిప్పీన్స్‌లో దుండగులు జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. బటాక్ నగరంలో నివసించే జస్వీందర్‌సింగ్ (38) మంగళవారం కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ సమయంలో జస్వీందర్ సోదరుడు అమరీందర్‌సింగ్ కూడా కారులోనే ఉన్నారు. మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు జస్వీందర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా బుల్లెట్ గాయాలైన అతనిని బాటిక్ నగరంలోని ఒక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు చెప్పారు. జస్వీందర్ సోదరుడు అమరీందర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. కాగా, జస్వీందర్‌పై కాల్పులు జరిపిన వ్యక్తులు ఎవరు, ఎందుకు కాల్పులు జరిపారనే విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నెల రోజుల వ్యవధిలో దుండగుల కాల్పుల్లో మరణించిన రెండో భారతీయుడు జస్వీందర్. ఆగస్టలో ఓల్డ ఎమర్స బీచ్ రిసార్టలో పంజాబ్‌కు చెందిన రమణ్‌దీప్‌సింగ్ గిల్‌పై దుండగులు కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. -
ఫిలిప్పీన్స్‌లో భారతీయుడి కాల్చివేత
ఫిలిప్పీన్స్‌లో గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయుడు మరణించగా, మరొకరు సురక్షితంగా బయటపడ్డాడు. జస్వీందర్ సింగ్ (38) అనే వ్యక్తి బటాక్ నగరంలో నివసిస్తున్నాడు. మంగళవారం ఆయన తన సమీప బంధువు అమరీందర్ సింగ్‌తో కలసి బటాక్ నుంచి ఇలోకస్ సర్ రాష్ట్రానికి కారులో బయల్దేరాడు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా మోటార్ సైకిల్‌పై వచ్చిన ఓ అగంతకుడు వారిపై కాల్పులు జరిపినట్టు ఫిలిప్పీన్స్ మీడియా వెల్లడించింది. ఈ సంఘటనలో అమరీందర్ సురక్షితంగా తప్పించుకోగా, జస్వీందర్ తీవ్రంగా గాయపడ్డాడు. జస్వీందర్ శరీరంలోకి చాలా బులెట్లు దూసుకెళ్లాయి. చికిత్స కోసం ఆయనను బటాక్కు తరలించినా ఫలితం లేకపోయింది. జస్వీందర్ అప్పటికే మరణించినట్టు వైద్యలు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.