ప్రముఖ గ్యాంగస్టర్ కాల్చివేత
చండీగడ్ కు చెందిన గ్యాంగస్టర్, అక్రమ ఆయుధాల కేసులో నిందితుడు జస్విందర్ సింగ్ అలియాస్ రాకీ హత్యకు గురయ్యాడు. గ్యాంగస్టర్ నుంచి రాజకీయవేత్తగా మారిన రాకీని శనివారం పర్వనూ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. హిమాచల్ ప్రదేశ్ కు విహార యాత్రకు వెళ్లిన రాకీ సిమ్లా నుంచి చండీగఢ్ కు తిరిగి వస్తుండగా హత్యకు గురయ్యాడు. అతని ప్రత్యర్థి ముఠా సభ్యులు ఈ ఘటనకు బాధ్యులని పోలీసులు అనుమానిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లా పర్వానూ లో దుండగులు కాల్చి చంపారు. సోలన్ ఎస్పీ అంజుం అలా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఐజీ జైదీ అందించిన వివరాల ప్రకారం ముష్కరులు రాకీపై అతి సమీపంనుంచి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అక్కడిక్కడే చనిపోయాడు. అనంతరం సంఘటనా స్థలంనుంచి పారిపోయారు. ఈ ఘటనలో అతపి గన్ మెన్ కూడా గాయపడినట్టు తెలుస్తోంది.
అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారు తెలిపారు. దుండగులు రెండు వేర్వేరు వాహనాల్లో వచ్చారన్నారు. ముష్కరులు ఇద్దరు బైక్ పై నా, మరో ఇద్దరు కారులో వచ్చినట్టు ఫాలో ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. దని తెలుస్తుంది. కారులో కూర్చున్నవారు రాకీ కాల్పులు జరిపారని, బైక్ పై వచ్చిన ఖాళీ బుల్లెట్లను తీసుకెళ్లినట్టుగా సీసీటీవీలో రికార్డైందన్నారు. నిందితులను గుర్తించామని, త్వరలోనే నిర్బంధంలోకి తీసుకుంటామని తెలిపారు. రాకీకి అనేక కరుడు కట్టిన అనేక నేరాలతో సంబంధముందని, హత్యకేసులు నమోదయ్యాయని తెలిపారు. 2006 లో చండీగఢ్ లేక్ క్లబ్ లో మరో గ్యాంగస్ట్ర్ ప్రభజిత్ సింగ్ హత్య కేసులో రాకీ హస్తం ఉందని ఆరోరపణలు, ఆకేసునుంచి నిర్దోషిగావిడుదలయ్యాడన్నారు. అలాగే పంజాబ్లో అనేక ముఠాలతో సంబంధాలు నెరపిన రాకీకి ఉత్తర ప్రదేశ్ లోని అనేకమంది నేరగాళ్లతో సంబంధాలున్నట్టు తెలిపారు. కాగా 2012 లో, ఫాజిల్కా నియోజవర్గంనుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాకీ గత ఏడాది అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ అయ్యాడు.