సంబంధాల బలోపేతానికి ‘యాక్ట్ ఈస్ట్’ | 'Look East' policy now turned into 'Act East' policy: Narendra Modi | Sakshi
Sakshi News home page

సంబంధాల బలోపేతానికి ‘యాక్ట్ ఈస్ట్’

Published Sun, Dec 28 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

సంబంధాల బలోపేతానికి ‘యాక్ట్ ఈస్ట్’

సంబంధాల బలోపేతానికి ‘యాక్ట్ ఈస్ట్’

ఫిజీ జనాభాలో 37 శాతం మంది భారత సంతతికి చెందినవారే. రాజీవ్‌గాంధీ అనంతరం 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ. జి-20 దేశాల తొమ్మిదో శిఖరాగ్ర సదస్సులో మోదీ నల్లధనం వెలికితీత గురించి ప్రధానంగా ప్రస్తావించారు.
 
మోదీ విదేశీ పర్యటనలు  
మయన్మార్: భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11-20 తేదీల మధ్య  మూడు దేశాల్లో పది రోజులపాటు పర్యటించారు. 40 మంది ప్రపంచ దేశాల నేతలను కలుసుకున్నారు. మొదటగా మయన్మార్ (బర్మా) వెళ్లారు. ఆ దేశ రాజధాని నేపిటాలో అధ్యక్షుడు థీన్‌సేన్‌తో సమావేశమయ్యారు. నవంబర్ 12న నేపిటాలో జరిగిన 12వ ఆసియాన్-భారత్  సదస్సులో  మోదీ ప్రసంగించారు. ఇందులో ఆగ్నేయాసియా దేశాల కూటమిలో సభ్యులైన పది దేశాల నేతలు పాల్గొన్నారు. బ్రూనై, కాంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పీన్‌‌స దేశాలకు ఆసియాన్‌లో సభ్యత్వం ఉంది. ఈ సదస్సులో మోదీ ‘యాక్ట్ ఈస్ట్’ విధానాన్ని ప్రకటించారు. ఈ విధానంలో భారత్‌కు ఆసియాన్ దేశాలతో సంబంధాలు అత్యంత ముఖ్యమైనవిగా మోదీ స్పష్టం చేశారు. 2015 చివరికల్లా ఆసియాన్-భారత్ మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని నాయకులు లక్ష్యంగా నిర్ణయించారు.
 
 నవంబర్ 13న నేపిటాలో నిర్వహించిన తొమ్మిదో తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు (ఈఏఎస్)లో భారత ప్రధాని పాల్గొన్నారు. ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు వ్యతిరేకంగా తూర్పు ఆసియా సదస్సు చేసిన ప్రకటనను మోదీ సమర్థించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలని  పిలుపునిచ్చారు. తూర్పు ఆసియా సదస్సులో పది ఆగ్నేయాసియా దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యా (మొత్తం 18) దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు, ప్రతిపక్ష నేత ఆంగ్‌సాన్ సూకీతోనూ మోదీ సమావేశమయ్యారు.
 
 ఆస్ట్రేలియా:
 మయన్మార్ నుంచి నరేంద్రమోదీ ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ముందుగా ఆయన బ్రిస్బేన్‌లో నిర్వహించిన జి-20 దేశాల తొమ్మిదో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు నవంబర్ 15, 16 తేదీల్లో జరిగింది. జి-20 సదస్సు అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌తో కాన్‌బెర్రాలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రసంగించారు. సిడ్నీలోని ఆల్ఫోన్‌‌స ఎరినాలో 20 వేల మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి నవంబర్ 17న మాట్లాడారు. ఈ సందర్భంగా జన్‌ధన్ యోజన పథకం గురించి వివరించారు. కేవలం పది వారాల్లోనే ఏడు కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు చెప్పారు. నవంబర్ 18న మెల్‌బోర్‌‌న నగరానికి వెళ్లారు. 161 ఏళ్ల చరిత్ర ఉన్న మెల్‌బోర్‌‌న క్రికెట్ మైదానాన్ని సందర్శించారు. మోదీ గౌరవార్థం ఆస్ట్రేలియా ప్రధాని ఇచ్చిన విందులో క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, వీవీఎస్.లక్ష్మణ్, అలన్ బోర్డర్ పాల్గొన్నారు.
 
 ఫిజీ:
 మూడు దేశాల పర్యటనలో చివరగా నవంబర్ 19న పసిఫిక్ మహాసముద్రంలోని ఫిజీ దేశాన్ని సందర్శించారు. 33 ఏళ్ల అనంతరం  భారత ప్రధాని ఫిజీలో పర్యటించడం ఇదే ప్రథమం. 1981లో ఫిజీలో పర్యటించిన చివరి భారత ప్రధాని ఇందిరాగాంధీ. ఫిజీ ప్రధాని ఫ్రాంక్ బైనిమరామాతో సమావేశమయ్యారు. ఫిజీ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఫిజీ దేశంలోని చక్కెర పరిశ్రమకు భారత్ 75 మిలియన్ డాలర్ల రుణ సహాయం అందిస్తుందని ప్రకటించారు.
 
 నేపాల్‌లో సార్‌‌క సదస్సు:
 2014 నవంబర్ 25న 18వ సార్‌‌క శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు నేపాల్ రాజధాని ఖాట్మాండు చేరుకున్నారు. సార్‌‌క సదస్సు నవంబర్ 26, 27 తేదీల్లో జరిగింది. సార్‌‌కలో భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్ దేశాలకు సభ్యత్వం ఉంది. ఖాట్మండు సదస్సు సందర్భంగా మోదీ పాకిస్థాన్ మినహా మిగతా దేశాల నాయకులతో విడిగా చర్చలు జరిపారు.
 
 మాదిరి ప్రశ్నలు
 1.    12వ ఆసియాన్ - భారత సదస్సు 2014 నవంబర్ 12న ఏ నగరంలో నిర్వహించారు?
     ఎ) సింగపూర్    బి) మనీలా    
     సి) హనోయ్    డి) నేపిటా
 2.    ఆగ్నేయాసియా దేశాల కూటమిలో సభ్యత్వం లేనిది?
     ఎ) లావోస్    బి) వియత్నాం
     సి) జపాన్    డి) మలేషియా
 3.    ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఆసియాన్) ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది?
     ఎ) థాయిలాండ్     బి) ఫిలిప్పీన్‌‌స
     సి) ఇండోనేషియా    డి) మలేషియా
 4.    థీన్‌సేన్ ఏ దేశాధ్యక్షులు?
     ఎ) బ్రూనై    బి) కాంబోడియా
     సి) వియత్నాం    డి) మయన్మార్
 5.    భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ సదస్సులో ‘యాక్ట్ ఈస్ట్’ విధానాన్ని ప్రకటించారు?
     ఎ) బ్రిక్స్         బి) ఆసియాన్- భారత్
     సి) జి-20        డి) సార్‌‌క
 6.    2015 నాటికి ఆసియాన్-భారత్ మధ్య వాణిజ్యాన్ని ఎన్ని బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?
     ఎ) 100    బి) 200     
     సి) 150     డి) 250
 7.    తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్)లో ఎన్ని దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి?
     ఎ) 10       బి) 18    సి) 16    డి) 20
 8.    భారత్‌కు సభ్యత్వంలేని కూటమి?
     ఎ) జి-20     
     బి) తూర్పు ఆసియా సదస్సు
     సి) బ్రిక్స్    డి) ఆసియాన్
 9.    భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంగ్‌సాన్ సూకీతో సమావేశమయ్యారు. ఆమె ఏ దేశ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు?
     ఎ) వియత్నాం    బి) చైనా
     సి) మయన్మార్    డి) థాయిలాండ్
 10.    అమెరికా ఏ కూటమిలో సభ్యదేశంగా ఉంది?
     ఎ) ఆసియాన్    బి) ఎస్‌సీవో
     సి) సార్‌‌క   డి) తూర్పు ఆసియా సదస్సు
 11.    2014 నవంబర్ 15, 16 తేదీల్లో జి-20 దేశాల తొమ్మిదో శిఖరాగ్ర సదస్సును ఎక్కడ నిర్వహించారు?
     ఎ) దక్షిణ కొరియా    బి) కెనడా
     సి) మెక్సికో     డి) ఆస్ట్రేలియా
 12.    నరేంద్ర మోదీ కంటే ముందు 28 ఏళ్ల కిందట 1986లో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత ప్రధాని?
     ఎ) ఇందిరాగాంధీ    బి) వి.పి. సింగ్
     సి) రాజీవ్ గాంధీ    డి) ఐ.కె. గుజ్రాల్
 13.    జి-20 దేశాలు 2018 వరకు అంతర్జాతీయ ఆర్థికవృద్ధిని ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి?
     ఎ) ఒక శాతం    బి) రెండు శాతం    
     సి) నాలుగు శాతం    డి) అయిదు శాతం
 14.    జి-20 దేశాల సదస్సు పూర్తి కాకుండానే మధ్యలోనే నిష్ర్కమించిన నాయకుడు?
     ఎ) స్టీఫెన్ హార్పర్     బి) డేవిడ్ కామెరాన్
     సి) షింజో అబే    డి) వ్లాదిమిర్ పుతిన్
 15.    జి-20లో సభ్యత్వం ఉన్న సంస్థ?
     ఎ) అంతర్జాతీయ ద్రవ్యనిధి    
     బి) ప్రపంచ బ్యాంక్
     సి) యూరోపియన్ యూనియన్    
     డి) అంతర్జాతీయ వాణిజ్య సంస్థ
 16.    ఆర్థిక మంత్రుల, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంగా జి-20 ఎప్పుడు ఏర్పడింది?    
     ఎ) 1999   బి) 2003  సి) 2008  డి) 2000
 17.    2013లో 71 బిలియన్ డాలర్ల రెమిటెన్‌‌సలు పొంది ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
     ఎ) అమెరికా    బి) భారత్
     సి) చైనా    డి) జపాన్
 18.    2015 నవంబర్‌లో జి-20 సదస్సు ఎక్కడ  జరుగుతుంది?
     ఎ) బాలి, ఇండోనేషియా    
     బి) రియాద్, సౌదీ అరేబియా
     సి) అంతల్యా, టర్కీ    
     డి) టొరాంటో, కెనడా
 19.    2016లో జి-20 శిఖరాగ్ర సదస్సును ఏ దేశంలో నిర్వహించనున్నారు?
     ఎ) చైనా    బి) భారత్
     సి) అర్జెంటీనా    డి) మెక్సికో
 20.    జి-20 దేశాల తొమ్మిదో శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించిందెవరు?
     ఎ) బరాక్ ఒబామా బి) డిల్మా రౌసెఫ్
     సి) జాకోబ్ జుమా    డి) టోనీ అబాట్
 21.    ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని?
     ఎ) ఇందిరాగాంధీ    బి) రాజీవ్ గాంధీ
     సి) లాల్‌బహదూర్ శాస్త్రి
     డి) నరేంద్ర మోదీ
 22.    ఆస్ట్రేలియాలోని ఏ నగరంలో ఆల్ఫోన్‌‌స ఎరీనాలో 20 వేలమంది ప్రవాస భారతీయులనుద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించారు?
     ఎ) బ్రిస్బేన్     బి) కెయిన్‌‌స
     సి) సిడ్నీ    డి) అడిలైడ్
 23.    భారత ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం ఆస్ట్రేలియా ప్రధాని ఏ నగరంలోని క్రికెట్ మైదానంలో విందునిచ్చారు?
     ఎ) మెల్‌బోర్‌‌న     బి) సిడ్నీ
     సి) పెర్‌‌త    డి) బ్రిస్బేన్
 24.    బ్రిస్బేన్ నగరంలో ఏ జాతీయ నాయకుని కంచు విగ్రహాన్ని భారత ప్రధాని ఆవిష్కరించారు?
     ఎ) సర్దార్ వల్లభాయ్ పటేల్
     బి) మహాత్మాగాంధీ
     సి) శ్యామప్రసాద్ ముఖర్జీ
     డి) బాలగంగాధర్ తిలక్
    
సమాధానాలు:
     1) డి;     2) సి;     3) సి;     4) డి;
     5) బి;     6) ఎ;     7) బి;     8) డి;
     9) సి;     10) డి;     11) డి;     12) సి;
     13) బి;     14) డి;     15) సి;     16) ఎ;
     17) బి;     18) సి;     19) ఎ;     20) డి;
     21) డి;     22) సి;     23) ఎ;     24) బి.
 
 ఎన్. విజయేందర్‌రెడ్డి
 సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్

 
 

ఉద్యోగాలు
 సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్
 హైదరాబాద్‌లోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వేర్‌హౌస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టుల సంఖ్య: 25
 అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు  ఇంగ్లిష్ టైప్‌రైటింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి.
 వయసు: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జనవరి 19
 వెబ్‌సైట్: http://cewacor.nic.in/
 సర్వే ఆఫ్ ఇండియా
 సర్వే ఆఫ్ ఇండియా(ఎస్‌ఓఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 - టోపో ట్రెయినీ: 118
 అర్హత: బీఎస్సీ (మ్యాథమెటిక్స్).
 వయసు: 18 - 27 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష, స్టీరియోస్కోపిక్ ఫ్యుజన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
 దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 21
 వెబ్‌సైట్: www.surveyofindia.gov.in
 
 జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
 జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ)  అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్ -1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
పోస్టుల సంఖ్య: 65
 విభాగాలు: ఇన్సూరెన్స్, హెచ్‌ఆర్, జనరల్, ఫైనాన్స్/ అకౌంట్స్, ఇంజనీరింగ్ (కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఏరోనాటికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), లీగల్, స్టాటిస్టిక్స్, మెడికల్.
 అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జనవరి 24
 వెబ్‌సైట్: www.gicofindia.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement