మెల్ బోర్న్:ఆస్టేలియాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని అత్యత్తన్న ఉద్యోగం వరించింది. పీయూష్ గుప్తా అనే వ్యక్తి తాజాగా ఆస్టేలియాలోని నేషనల్ ఆస్టేలియా బ్యాంక్(నాబ్) కు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులైయ్యారు. ప్రస్తుతం ఈ విభాగంలో విధులు నిర్వహిస్తున్న జఫ్ టామ్లిసన్ పదవీ విరమణ గడువు నవరంబర్ 5 వ తేదీతో ముగుస్తుంది. అనంతరం పీయూష్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తారని నాబ్ చైర్మన్ మైఖేల్ ఛానీ తెలిపారు. ఆస్టేలియాలోని అతి పెద్ద ఆర్ధిక సంస్థల్లో నాబ్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.