U-19 World Cup: Australia Spinner Nivethan Radhakrishnan Interesting Facts - Sakshi
Sakshi News home page

Under-19 World Cup: ఆస్ట్రేలియా అండర్‌-19లో భారత సంతతి కుర్రాడు.. వింత బౌలర్ల జాబితాలో చోటు

Published Tue, Dec 14 2021 7:22 PM | Last Updated on Tue, Dec 14 2021 7:44 PM

U-19 World Cup:Australia Spinner Nivethan Radhakrishnan Intresting Facts - Sakshi

Australia insane spinner Nivethan Radhakrishnan Facts.. వచ్చే ఏడాది జనవరిలో అండర్‌-19 వరల్డ్‌కప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజగా ఆస్ట్రేలియా కూడా 15 మందితో కూడిన అండర్‌-19 ప్రాబుబుల్స్‌ను ప్రకటించింది. ఈ జట్టులో ఒక కుర్రాడు అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అతనే నివేథన్‌ రాధాకృష్ణన్‌. 

చదవండి: Ashes 2021-22: ప్రతిష్టాత్మక టెస్ట్‌ సిరీస్‌లో తెలంగాణ కుర్రాడు..

సాధారణంగా స్పిన్‌ బౌలర్‌ అయిన రాధాకృష్ణన్‌లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అతను రెండు చేతులతో(ఎడమ, కుడి) బౌలింగ్‌ చేయడంలో దిట్ట. దీంతో అతన్ని లెఫ్టార్మ్‌ ? లేక రైట్‌ ఆర్మ్? స్పిన్నర్‌ అనాలా అనేది సందిగ్దంగా మారింది. క్రికెట్‌లో ఇలాంటి బౌలర్లు ఉండడం అరదుగా జరుగుతుంటుంది. బౌలింగ్‌లో వైవిధ్యత చూపించడం కోసం ఏ బౌలర్‌ అయినా ఒకే శైలి బౌలంగ్‌కు పరిమితమవుతాడు. కానీ నివేథన్‌ రాధాకృష్ణన్‌ మాత్రం అటు లెఫ్ట్‌.. ఇటు రైట్‌ ఆర్మ్‌తో బౌలింగ్‌ చేస్తూ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఇదే అతన్ని అందరిలో ప్రత్యేకంగా మార్చి ఇవాళ అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో ఆసీస్‌ ప్రాబబుల్స్‌లో చోటు దక్కేలా చేసింది. 

చదవండి: Big Bash 2021: డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌.. గిల్‌క్రిస్ట్‌తో మహిళా కామెంటేటర్‌ మజాక్‌ 

ఆస్ట్రేలియన్‌ అండర్‌-19 క్రికెటర్‌ నివేథన్‌ రాధాకృష్ణన్‌ ముఖ్య విషయాలు
2013లో నివేథన్‌ రాధాకృష్ణన్‌ భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చి సిడ్నీలో స్థిరపడ్డాడు. 
ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్‌ బౌలర్‌గా వ్యవహరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ ఆధ్వర్యంలో బౌలింగ్‌లో రాటు దేలాడు.
అండర్‌-16 లెవెల్‌ ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించి వైవిధ్యమైన బౌలింగ్‌తో తొలిసారి గుర్తింపు పొందాడు
ఎన్‌ఎస్‌డబ్ల్యూ ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడిన నివేథన్‌ రాధాకృష్ణన్‌ ఆ సిరీస్‌లో 898 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.  ఆ తర్వాత ఎన్‌ఎస్‌డబ్ల్యూ, తస్మానియా క్రికెట్‌ నుంచి అవార్డులతో పాటు అవకాశాలు అందుకున్నాడు. 
తస్మానియా క్రికెట్‌ తరపున ఈ సీజన్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన నివేథన్‌ రాధాకృష్ణన్‌ 622 పరుగులతో రాణించాడు.

ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టు: 
హర్కీరత్ బజ్వా, ఐడాన్ కాహిల్, కూపర్ కొన్నోలీ, జాషువా గార్నర్, ఐజాక్ హిగ్గిన్స్, క్యాంప్‌బెల్ కెల్లావే, కోరీ మిల్లర్, జాక్ నిస్బెట్, నివేతన్ రాధాకృష్ణన్, విలియం సాల్జ్‌మన్, లచ్‌లాన్ షా, జాక్సన్ సిన్‌ఫీల్డ్, టోబియాస్ స్నెల్, టామ్ విట్నీ, టెయాగ్ విట్నీ

యాంబిడెక్స్‌ట్రస్‌ క్రికెటర్‌ అంటే...
సాధారణంగా ఏకకాలంలో లెఫ్టార్మ్‌, రైట్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ చేయగలిగిన వారిని యాంబిడెక్స్‌ట్రస్‌ క్రికెటర్‌ అని పిలుస్తారు.  అయితే ప్రస్తుత క్రికెట్‌లో ఇలాంటి శైలి అరుదుగా కనిపిస్తుంది. తాజాగా నివేథన్‌ రాధాకృష్ణన్‌ వార్తల్లో నిలవడం ద్వారా యాంబిడెక్స్‌ట్రస్‌ క్రికెటర్‌ పదం మరోసారి వెలుగులోకి వచ్చింది. క్రికెట్‌ చరిత్రలో యాంబిడెక్స్‌ట్రస్‌ క్రికెటర్లు చాలా మందే ఉన్నప్పటికీ..  ఇప్పటివరకు ఒక ఐదుగురి పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపించాయి.

హనీఫ్‌ మొహ్మద్‌(పాకిస్తాన్‌)


పాకిస్తాన్‌ బ్యాటింగ్‌లో సూపర్‌ స్టార్‌గా వెలుగొందిన హనీఫ్‌ మొహ్మద్‌ నిజానికి రెగ్యులర్‌ బౌలర్‌ కాదు. కానీ పార్ట్‌టైమ్‌ బౌలింగ్‌ చేసిన హనీఫ్‌ రెండు చేతులతో బౌలింగ్‌ చేయగలడు. పాకిస్తాన్‌ తరపున 55 టెస్టు మ్యాచ్‌ల్లో 3915 పరుగులు చేశాడు.

గ్రహం గూచ్‌(ఇంగ్లండ్‌)


ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ దిగ్గజం గ్రహం గూచ్‌ కూడా యాంబిడెక్స్‌ట్రస్‌ ఆటగాడే. బ్యాటింగ్‌లో ఎన్నోసార్లు మెరుపులు మెరిపించిన గ్రహం గూచ్‌.. రైట్‌ ఆర్మ్‌.. లెఫ్ట్‌ఆర్మ్‌ మీడియం పేస్‌తో 23 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్‌ తరపున గ్రహం గూచ్‌ 118 టెస్టుల్లో 8900 పరుగులు.. 125 వన్డేల్లో 4290 పరుగులు సాధించాడు.

హసన్‌ తిలకరత్నే(శ్రీలంక)


స్వతహాగా లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌ అయిన హసన్‌ తిలకరత్నే ఒకానొక సమయంలో శ్రీలంక క్రికెట్‌లో రాణించాడు. లంక తరపున 83 టెస్టులు.. 200 వన్డేలు ఆడిన హసన్‌ తిలకరత్నే బౌలింగ్‌లో రైట్‌ ఆర్మ్‌ స్పిన్‌ ఎక్కువగా వేసేవాడు. కానీ 1996 వన్డే ప్రపంచకప్‌లో కెన్యాతో మ్యాచ్‌లో తిలకరత్నే ఆఖరి ఓవర్లో రైట్‌ ఆర్మ్‌.. లెఫ్టార్మ్‌ బౌలింగ్‌ చేసి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక 1996 వన్డే ప్రపంచకప్‌ను శ్రీలంక ఎగరేసుకపోయిన సంగతి తెలిసిందే.

అక్షయ్‌ కర్నేవార్‌(భారత్‌)


విదర్భ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ అయిన అక్షయ్‌ కర్నేవార్‌ ప్రస్తుతం దేశవాలీలో లిస్ట్‌-ఏ, టి20 మ్యాచ్‌లు ఆడుతు బిజీగా గడుపుతున్నాడు. అక్షయ్‌ కర్నేవార్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌.. రైట్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ చేయడంలో సమర్థుడు. విజయ్‌ హజారే ట్రోఫీలో విదర్భ తరపున అక్షయ్‌ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో 16 వికెట్లు తీసి సీజన్‌ బెస్ట్‌ నమోదు చేశాడు.

కమిందు మెండిస్‌(శ్రీలంక)


17 ఏళ్ల కమిందు మెండిస్‌ శ్రీలంక తరపున రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌.. స్లో లెఫ్ట్‌ఆర్మ్‌ ఆర్థడోక్స్‌ బౌలింగ్‌ చేయడంలో దిట్ట. రానున్న అండర్‌-19 వరల్డ్‌కప్‌లో లంక తరపున ప్రాతినిధ్యం వహించనున్న కమిందు మెండిస్‌ ఆ జట్టుకు కీలకంగా మారనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement