జీవితంలో స్థిరపడాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారం, రియల్ ఎస్టేట్ ఇలా ఏదో ఒకటి చేస్తూ బాగా సంపాదించాలనుకునే యువకులు ప్రస్తుతం కోకోల్లలుగానే ఉన్నారు. ఉద్యోగం చేసేవారితో పోలిస్తే.. ఏదో ఒక బిజినెస్ చేసేవారికి ఎక్కువ ఆదాయం వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వ్యాపారాల్లో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బు బాగా సంపాదించవచ్చు.
భారతీయ సంతతికి చెందిన 'కరుణ్ విజ్' కెనడాలో నెలకు రూ. 9 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇతడు కెనడాలోని అంటారియోలోని హామిల్టన్‌లోని మెక్‌మాస్టర్ యూనివర్సిటిలో ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి తెలుసుకున్నాడు.
26 సంవత్సరాల వయసు నాటికే.. అతడు హామిల్టన్ ఆస్తిని కొనుగోలు చేసి ఏడు మంది కాలేజీ విద్యార్థులకు అద్దెకు ఇవ్వడం మొదలెట్టాడు. ప్రస్తుతం కరుణ్ విజ్ కెనడాలో 28 గదులతో ఉన్న నాలుగు ప్రాపర్టీలను కొనుగోలు చేసి, వాటి ద్వారా నెలకు రూ. 9 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు.
ఇదీ చదవండి: 13 రాష్ట్రాల్లో వీరిదే హవా..! ఆదాయం రూ. కోట్లలోనే..
చదువు పూర్తయిన తరువాత అప్లికేషన్ ఇంజనీర్‌గా పనిచేసిన కరుణ్.. ఇప్పుడు సేల్స్ మేనేజర్‌గా పంచేస్తూ.. సంవత్సరానికి రూ. 1.52 కోట్లు వేతనంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇతడు ప్రస్తుతం చికాగోలో తన భార్య, కూతురుతో కలిసి నివాసముంటున్నాడు. తక్కువ రుణాలతో ఇంకా ఆస్తులను పెంచుకుంటూ వెళ్తున్న ఈ ఎన్నారై తన ఆస్తిని ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకుంటూ.. ఎంతోమంది యువ వ్యాపారవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment