
లండన్: అత్యాచారం కేసుల్లో నిందితుడికి భారత సంతతి న్యాయమూర్తి పరమ్‌జిత్ కౌర్ బాబీ చీమా–గ్రప్ ఏకంగా 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధించడలో యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో సంచలనాత్మకంగా మారింది. మెట్రోపాలిటన్ పోలీసు మాజీ అధికారి అయిన డేవిడ్ కారిక్(48) 2003 నుంచి 2020 దాకా.. 17 ఏళ్ల వ్యవధిలో దాదాపు 12 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిని దారుణంగా హింసించాడు.
అతడు 49 నేరాలకు పాల్పడినట్లు తేలింది. నేరాలన్నీ నిరూపితమయ్యాయి. లండన్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి పరమ్‌జిత్ కౌర్ మంగళవారం తీర్పు ప్రకటించారు. దోషికి 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని, పెరోల్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 30 ఏళ్లు జైల్లో ఉండాల్సిందేనని ఆమె తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment