ఎన్ని క్లిష్టమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నా ఆన్‌లైన్ దొంగలు(హ్యాకర్లు) వాటిని ఛేదిస్తున్న నేపథ్యంలో భారతీయ సంతతికి చెందిన కొందరు సహా పలువురు పరిశోధకులు పాస్‌వర్డ్‌ల రక్షణకు పలు అధునాతన పద్ధతులు కనిపెట్టారు.
వాషింగ్టన్: ఎన్ని క్లిష్టమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నా ఆన్‌లైన్ దొంగలు(హ్యాకర్లు) వాటిని ఛేదిస్తున్న నేపథ్యంలో భారతీయ సంతతికి చెందిన కొందరు సహా పలువురు పరిశోధకులు పాస్‌వర్డ్‌ల రక్షణకు పలు అధునాతన పద్ధతులు కనిపెట్టారు. ఈ పద్ధతుల్లో పాస్‌వర్డ్‌లకు పూర్తి స్థాయి రక్షణ ఉంటుం దని వారు అంటున్నారు. బర్మింగంలోని అలబామా వర్సిటీ, ఎర్విన్‌లోని కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ కొత్త పద్ధతులు కనుగొన్నారు. దీనిపై అలబా మా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నితీశ్ సక్సేనా మాట్లాడుతూ.. తాము రెండు ఫ్యాక్టర్లు కలిగిన నాలుగు రకాల స్కీములను పరీక్షించి చూశామన్నారు.
ఇందులో... ప్రతి స్కీమ్ లో సర్వర్లు అనేక ర్యాండమ్ పాస్‌వర్డులను నిక్షిప్తం చేసుకుం టాయని, వాటికి సంబంధించి న రహస్య కోడ్‌ను వినియోగదారుడి సెల్‌ఫోన్‌లో భద్రపరుస్తారని చెప్పారు. ఈ స్కీముల్లో.. వినియోగదారుడు పాస్‌వర్డు, పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదన్నారు. పాస్‌వర్డ్ ఎంటర్ చేయగానే సంబంధిత పిన్‌ను అతడి స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ కనెక్షన్ లేదా, క్యూఆర్ కోడ్ ద్వారా సర్వర్‌కు పంపుతుందని చెప్పారు. ఫలితంగా ఈ పాస్ వర్డ్‌లను ఎవరూ హ్యాక్ చేయడం సాధ్యం కాదన్నారు.