నేటి టెక్నాలజీ యుగంలో సోషల్‌మీడియా, ఇతర యూపీఐ యాప్స్, మరికొన్ని యాప్స్‌లను మనలో చాలా మంది వాడుతుంటాం. మనకు సంబంధించిన ఫోటోలను, డాక్యుమెంట్లను, ఇతర సీక్రెట్ అంశాలను స్మార్ట్‌ఫోన్లలో, లేదా ఆన్‌లైన్ యాప్స్‌లో, ఇతరులనుంచి రక్షణ పొందేందుకుగాను ఆయా యాప్స్‌కు, ఆన్‌లైన్ సర్వీసులకు పాస్‌వర్డ్‌లను కచ్చితంగా ఏర్పాటుచేస్తాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తోనో, లేక పిన్‌తో బలమైన పాస్‌వర్డ్‌లను ఏర్పాటుచేస్తాం.
చదవండి: భారత తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారు ఇదే..!
సెకనుకు 579పాస్‌వర్డ్‌లపై దాడి..!
మనం ఎంత బలమైన పాస్‌వర్డ్‌ను ఏర్పాటుచేసిన హ్యాకర్లు వాటిని సులువుగా ట్రేస్ చేసి ఆయా వ్యక్తులు సమాచారాన్ని లాగేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకానోక సందర్భంలో ప్రతి సెకనుకు 579పాస్‌వర్డ్‌లపై హ్యాకర్లు దాడి చేస్తోన్నట్లు మైక్రోసాఫ్ట్ తన నివేదికలో పేర్కొంది. ఒక ఏడాది చూసుకుంటే మొత్తంగా 18 వందల కోట్ల పాస్‌వర్డ్‌లపై దాడులు జరుగుతున్నాయి.
మైక్రోసాఫ్ట్ కొత్త వ్యూహం..!
పాస్‌వర్డ్‌లకు స్వస్తి పలుకుతూ నూతన ఒరవడి సృష్టించాలని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలను మైక్రోసాఫ్ట్ ముమ్మరం చేస్తోంది. ఇకపై పాస్‌వర్డ్స్‌లేకుండా మైక్రోసాఫ్ట్ యాప్స్‌లో, ఖాతాలో లాగిన్ అయ్యేలా మైక్రోసాఫ్ట్ దృష్టిసారించింది. పాస్‌వర్డ్స్‌లకు స్వస్తి పలుకుతూ మైక్రోసాఫ్ట్ అథనిటికేటర్, విండోస్ హలో, లేదా వెరిఫికేషన్ కోడ్ ద్వారా లాగిన్ అయ్యే విధానాలను మైక్రోసాఫ్ట్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఈ లాగిన్ ఫీచర్ విధానంతో మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన యాప్స్‌కు వర్తించేలా చేయనుంది. అందులో ఔట్‌లూక్ ,వన్‌డ్రైవ్ , మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ సెఫ్టీ, ఇతర మైక్రోసాఫ్ట్ యాప్స్‌కు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
పాస్‌వర్డ్స్ లేకుంగా లాగిన్ అయ్యే ఫీచర్‌ను 2019లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కమర్షియల్ యూజర్స్ కోసం మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ అకౌంట్ యూజర్లు యూజర్లు అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఆప్షన్‌లో, అడిషనల్ సెక్యూరిటీ ఆప్షన్స్‌లో పాస్‌వర్డ్‌లెస్ అకౌంట్ ఆప్షన్‌ను టర్నఆన్ చేయడం ద్వారా మైక్రోసాఫ్ట్ అథనికేటర్ యాప్స్‌నుంచి వచ్చే ఆన్‌స్క్రీన్ ప్రామ్ట్స్ తో లాగిన్ అవ్వచును. ఈ ఫీచర్ ప్రస్తుతం కమర్షియల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన స్విట్జర్లాండ్ సంస‍్థ..!
Comments
Please login to add a commentAdd a comment