ఆన్‌లైన్ మిత్రుడితో డేటింగ్‌లో ఉందని..
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతి వ్యక్తిపై హత్యా నేరం కేసు నమోదైంది. ప్రేమ్ రామ్‌పర్సోడ్(50) అనే వ్యక్తి భార్య రజ్వాంటీ బాల్డియో(46)ను సోమవారం దారుణంగా హత్య చేశాడు.
స్థానికంగా ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న రజ్వాంటీ బాల్డియో.. తన విధులు ముగించుకొని ఇంటికి తిరిగివెళ్తున్న సమయంలో ప్రేమ్ భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. అనంతరం కత్తితో విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడేగల సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి. ఇది చాలా తీవ్రమైన నేరమైని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ రిచర్డ్ బ్రౌన్ వెల్లడించారు.
విచారణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితం ప్రేమ్ 9000 డాలర్లు ఇచ్చి బాల్డియోను ప్రేమ్ అమెరికాకు పంపాడు. ఇటీవల బాల్డియో ఓ ఆన్‌లైన్ మిత్రుడితో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుసుకున్న ప్రేమ్ అక్కడకు వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.