University of Pittsburgh
-
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్లో ఏం జరిగింది?
వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి(20) మిస్సింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లిన సుదీక్ష ఓ బీచ్ వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటోంది. అక్కడే పిట్స్బర్గ్ యూనివర్సిటీలో ఆమె చదువుకుంటున్నారు. అయితే, గత వారం ఆమె తన స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లారు. ఐదుగురు అమ్మాయిలతో కలిసి డొమినికన్ రిపబ్లిక్లోని ప్రముఖ పర్యటక పట్టణమైన ప్యూంటా కానా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మార్చి ఆరో తేదీన స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్ వద్ద బీచ్ వెంట నడుచుకుంటూ కనిపించారు. ఆ తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆందోళనకు గురై పోలీసులను సంప్రదించారు.ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు.. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సముద్ర తీరం వద్ద, సముద్రం లోపల డ్రోన్లు, హెలికాప్టర్లతో గత నాలుగు రోజులుగా ఆమె కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు ఏ ఆచూకీ లభించకపోవడంతో బహుశా ఆమె బీచ్లో కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు.. సుదీక్ష ఆచూకీ తెలియకపోవడంతో ఆమె పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.Urgent missing college student on Spring Break in the Dominican Republic - Sudiksha Konanki - last seen in brown bikini in picture below 👇 pic.twitter.com/AMdYPngwVK— Glenda (@Glendaragnarson) March 10, 2025ఈ సందర్బంగా ఆమె తండ్రి కోణంకి సుబ్బరాయుడు తాజాగా మాట్లాడుతూ..‘తప్పిపోయిన సుదీక్ష కోసం పోలీసులు గాలిస్తున్నారు. రిసార్ట్ పరిసరాలు, సముద్రం వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా కిడ్నాప్, మానవ అక్రమ రవాణా వంటి అవకాశాలను కూడా పరిశీలించాలని పోలీసులను కోరాం’ అని చెప్పుకొచ్చారు. La Defensa Civil y otras instituciones, continúan en la búsqueda de Sudiksha Konanki, la joven de nacionalidad india, quien desapareció la madrugada del jueves 6 de marzo mientras caminaba en una playa de Punta Cana, provincia de La Altagracia.Informan que también fueron… pic.twitter.com/ntQQxC738S— Noticias Telemicro (@NTelemicro5) March 9, 2025 -
పిట్స్బర్గ్ వర్సిటీతో ఎంవోయూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని వర్సిటీలకు అకడమిక్ సహకారం అందించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అమెరికాలోని పిట్స్బర్గ్ వర్సిటీతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం అవగాహనా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, పిట్స్బర్గ్ వర్సిటీ గ్లోబల్ అఫైర్స్ వైస్ ప్రోవోస్ట్ డాక్టర్ ఏరియల్ ఆర్మోనీ పరస్పరం ఎంవోయూలను మార్చుకున్నారు. ఏరియల్ ఆర్మోని మాట్లాడుతూ, 1787లో ఏర్పాటైన తమ వర్సిటీ వైద్యం, విద్య, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ రంగాల్లో బోధన, పరిశోధనలు చేస్తోందన్నారు. ప్రస్తుతం వర్సిటీ అమెరికాలో 5 క్యాంపస్లు, 28 వేల మంది విద్యార్థులను కలిగి ఉందన్నారు. ఈ ఎంవోయూ ద్వారా రాష్ట్రం లోని వర్సిటీలు, పిట్స్బర్గ్ వర్సిటీల మధ్య పరస్ప రం విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి, పరిశోధనల్లో సహాయసహకారం లభించనుందని పాపిరెడ్డి పేర్కొన్నారు. పిట్స్బర్గ్ వర్సిటీ అందిస్తున్న ఉత్తమ కోర్సులు, సబ్జెక్టులను రాష్ట్రంలోని వర్సిటీల్లో ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. రాష్ట్రంలోని వర్సిటీలు, పరిశోధన కేంద్రాలతో పిట్స్బర్గ్ వర్సిటీ అనుసంధానమై విద్యాపరిశోధనలు, విద్యాబోధన అంశాల అభివృద్ధికి సహకారం అందించనుందన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫె సర్ లింబాద్రి, వెంకటరమణ పాల్గొన్నారు. ఎంవోయూ అనంత రం పిట్స్బర్గ్ ప్రతినిధి బృందం సచివాలయంలో సీఎస్ ఎస్.కె.జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసింది. -
బాయ్స్ కన్నా ముందే పెద్దరికం
అబ్బాయిలకన్నా ముందు అమ్మాయిలే మానసికంగా పరిణతి చెందుతారన్న విషయం మరోమారు నిర్థారణ అయింది. పదకొండేళ్లలోపు బాలికల్లోని మెదడు అబ్బాయిలతో పోల్చి చూస్తే రెండుమూడేళ్లు ముందుగా పరిపక్వం చెందుతుందని పిట్స్బర్గ్ యూనివర్శిటీ (అమెరికా) పరిశోధకులు కనుగొన్నారు. శిశువయస్సు నుండి కౌమారం వరకు బాలబాలికలను ఎంపిక చేసుకుని వారి మెదడులో సంభవిస్తున్న మార్పులను ఎం.ఆర్.ఐ. స్కానింగ్ ద్వారా సునిశితంగా పరిశీలించి వారు ఈ నిర్థారణకు వచ్చారు. ప్రారంభంలో బాలుర మస్తిష్కం బాలికలలో కన్నా వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ తర్వాత్తర్వాత నెమ్మదిస్తుందట. అలా నెమ్మదించే వయసులో ఇక్కడ బాలికల మస్తిష్కం వేగం పుంజుకుంటుందట. కనుక ఈ పరుగుపందెంలో బాలికలదే పైచేయి అని పరిశోధకులు అంటున్నారు. -
విషవాయువులు పీలిస్తే... ఆటిజమ్
అనర్థం క్రోమియం, స్టెరీన్ వంటి రసాయనాల నుంచి వెలువడే విషపూరితమైన వాయువులు నరాల మీద తీవ్రమైన దుష్ర్పభావాన్ని చూపిస్తాయి. పిల్లలు దీర్ఘకాలం ఈ గాలి పీలిస్తే ఆటిజమ్ బారిన పడే ప్రమాదం ఉంటుందని అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ పిట్స్బర్గ్లోని ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ ఎవెలిన్ టాల్బోట్ తెలియచేశారు. ఈయన ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని తెలియచేసింది. పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాల విషపూరితమైన గాలుల ప్రభావం చిన్న పిల్లలతోపాటు గర్భంలో ఉన్న బిడ్డ ఎదుగుదల మీద కూడా తీవ్రంగా ఉంటుంది. అమెరికాలో ప్రతి 68 మంది పిల్లల్లో ఒకరు ఈ విధంగానే ఆటిజమ్ బారిన పడుతున్నట్లు వారు చెప్తున్నారు.