కోర్టులో బ్రిటన్ ప్రభుత్వం ఓడిపోయింది | Britain's government lost a court | Sakshi
Sakshi News home page

కోర్టులో బ్రిటన్ ప్రభుత్వం ఓడిపోయింది

Published Mon, Oct 12 2015 11:28 PM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

కోర్టులో బ్రిటన్ ప్రభుత్వం ఓడిపోయింది

కోర్టులో బ్రిటన్ ప్రభుత్వం ఓడిపోయింది

 ఆ నేడు 13 అక్టోబర్ 1988
 
పీటర్ మారైస్ రైట్ ఇంగ్లండ్ దేశపు సైంటిస్ట్ (1916-1995). ఎ15 అనే సెక్యూరిటీ సర్వీస్‌లో అధికారిగా పని చేశారు. ఎం15 అంటే మిలటరీ ఇంటిలిజెన్స్ సెక్షన్ 5. ఆ అనుభవంతో ఆయన ‘స్పై క్యాచర్’ అనే పుస్తకం రాశారు. అది మొదట ఆస్ట్రేలియాలో విడుదలైంది. ఆ తర్వాత 20 లక్షల కాపీల వరకు అమ్ముడై, ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఆ పుస్తకంలో ఉన్నవన్నీ పీటర్ రైట్ తాలూకు వృత్తి సంబంధమైన జ్ఞాపకాలు.

అయితే అవన్నీ వివాదాస్పద మైన వివరాలని, విశేషాలని, దేశ భద్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయని బ్రిటన్ భావించింది. ఆ పుస్తకం విడుదల కాకుండా నిషేధం విధించింది. దీనిపై పీటర్ రైట్ కోర్టులో ఫైట్ చేశారు. గెలిచారు. అప్పటికే ఇంకో దేశంలో విడుదలై, విషయాలు బయటికి వచ్చాయి కనుక బ్రిటన్‌లో విడుదల చేయడం వల్ల కొత్తగా జరిగే నష్టం ఏమీ ఉండదని కోర్టు ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement