విదేశాలకు బతుకమ్మ సంస్కృతి
విదేశాలకు బతుకమ్మ సంస్కృతి
Published Sat, Oct 1 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
కామారెడ్డి రూరల్ :
తెలంగాణ సంస్కృతిని దేశ విదేశా ల్లో చాటి చెప్పేందుకు బతుకమ్మ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎంపీ కల్వకుం ట్ల కవిత తెలిపారు. దుబాయ్‌లో తెలంగా ణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడాటానికి వెళ్లిన ఆమెను అక్కడ శుక్రవారం కామారెడ్డి డివిజన్ ప్రాంత వాసులు కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లవేళలా మద్దతుగా ఉంటామ ని ఎన్‌ఆర్‌ఐలు కవితతో పేర్కొన్నారు. ఎంపీని కలిసిన వారిలో కామారెడ్డి వాసులు ఆకుల సురేందర్, కళ్యాణి, దొంతి సురేష్‌రెడ్డి, రమణ, మొసర్ల శివారెడ్డి తదితరులు ఉన్నారు.
Advertisement