యువత వివేకానందుడి అడుగుజాడల్లో నడవాలని, ఆయన మార్గం సదా అనుసరణీయమని రామకష్ణ సేవాసమితి ఆదిలాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి లెనిన్ అన్నారు
‘వివేకానంద బాట అనుసరణీయం’
Published Sat, Sep 17 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
ఇచ్చోడ : యువత వివేకానందుడి అడుగుజాడల్లో నడవాలని, ఆయన మార్గం సదా అనుసరణీయమని రామకష్ణ సేవాసమితి ఆదిలాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి లెనిన్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీపాఠశాలలో శనివారం ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలలోని ప్రభుత్వం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వివేకానందుడి జీవితం, ఆయనిచ్చిన సందేశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రతీ విద్యార్థి వివేకాందుడి చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. వివేకానందుడు చెప్పిన వాటిలో కొన్నింటినైనా ఆచరించే ప్రయత్నం చేయాలని కోరారు. అనంతరం వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి సీహెచ్ క్రిష్ణ(ఆశ్రమ పాఠశాల తోషం), రెండో బహుమతి వాగదేవ్(ఆశ్రమ పాఠశాల, తోషం) గెలుపొందారు. కార్యక్రమంలో సమితి సభ్యులు లంక హన్మండ్లు, ప్రశాంత్‌రెడ్డి, స్థానిక పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు వీకే ప్రకాశ్ వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement