ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలి
Published Wed, Jul 27 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
మరిపెడ : దేశంలోని ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం కార్గిల్ సోల్జర్స్ మొమోరియల్ చైర్మన్ గాదె రాంబాబు ఆధ్వర్యంలో కార్గిల్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశం మనకు ఏమి ఇచ్చింది కాదని దేశానికి మనం ఏమిచ్చామని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కార్గిల్ స్తూపాన్ని ఏర్పాటు చేసిన రాంబాబును మనందరం అభినందించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ దేశానికి ఏదో విధంగా సేవ చేయాలని కోరారు. గాదె రాంబాబు, గుడిపుడి నవీన్, ఎంపీపీ తాళ్లపెల్లి రాణిశ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు బాల్నే మాణిక్యం, కురవి సీఐ శ్రీనివాస్, మరిపెడ సర్పంచ్ పానుగోతు రాంలాల్, మండల కో ఆప్షన్ సభ్యుడు అయూబ్‌పాషా, నాయకులు యాదగిరిరెడ్డి, వస్రాంనాయక్, రంగారెడ్డి, సర్పంచ్‌లు దుస్సా నర్సయ్య, భూక్య సేవ్యానాయక్, మక్సూద్, తోట సతీష్, లక్ష్మీనారాయణ, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement