రాష్ట్ర భాష హిందీ | The state language Hindi | Sakshi
Sakshi News home page

రాష్ట్ర భాష హిందీ

Published Tue, Sep 13 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

The state language Hindi

  • నేడు హిందీ దివస్‌
  • మన జాతీయ భాష హిందీ. ప్రపంచ భాషలలో చైనీస్‌ తరువాత అత్యంత ప్రాచుర్యం ఉన్న భాషగా గుర్తింపు పొందింది. జాతీయ సమైక్యత, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఈ భాష తోడ్పడుతోంది. బుధవారం హిందీ భాషా దివస్‌(హిందీ భాషా దినోత్సవం). ఈ నేపథ్యంలో హిందీ భాష విశిష్టతలపై ప్రత్యేక కథనం..
     
    కామారెడ్డి : 
    ‘హిందీ భాష హమారి జాన్‌ హై, హమారి పహ్‌చాన్‌ హై’ అంటూ దేశ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో మహాత్మాగాంధీ హిందీ భాష ఔన్నత్యాన్ని చాటారు. దేశ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ఈ భాషను విస్తృతంగా వాడుకున్నారు. దేశంలో అత్యధికులు మాట్లాడేది హిందీ భాష. ఇది దేశ ప్రజల మధ్య సంధాన భాషగా ఉపయోగపడుతోంది. దేశ జాతీయ భాషగా రాజ్యాంగం హిందీని గుర్తించిన సెప్టెంబర్‌ 14ను దేశంలో హిందీ దివస్‌గా జరుపుకుంటున్నారు. 
    దేశంలోని 10 రాష్ట్రాల్లో హిందీ అధికార భాష. 
    దేశ అధికార భాషగా హిందీ ఉంటుందని రాజ్యాంగంలోని 17వ భాగంలో 343 ఆర్టికల్‌లో పేర్కొన్నారు. అదే ఆర్టికల్‌లో రాజ్యంగం అమలులోనికి రాగానే 15 సంవత్సరాల వరకు అన్ని రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఆంగ్ల భాష ప్రయోగం కూడా చేయవచ్చని పేర్కొన్నారు. 1965కు ఆ నిబంధన పూర్తి కావాలి. కానీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. పాలకులు ఆంగ్లభాషనే ఇంకా వ్యవహారంలో ఉంచి హిందీ భాషకు ద్రోహం చేస్తున్నారని హిందీ భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
    హిందీ భాష లిపి దేవనాగరి లిపి. 
    హిందీ భాషకు పశ్చిమ హిందీ, పూర్వీహిందీ, ఖడీబోలీ, రాజస్థానీ, పహడీ, బీహారీ లాంటివి ఉపభాషలు.
    హిందీ భాషలో సూరదాసు సూర్యుడిగా, తులసీదాసు చంద్రుడిగా గుర్తింపు పొందారు. వీరు రాసిన సూర్‌సాగర్, రామచరితమానస్‌లు జీవగ్రంథాలుగా పేరుపొందాయి.
    మీరాబాయి కృష్ణుని భక్తిలో లీనమై రాసిన భజన పాటలు పదావళిలో ఉన్నాయి. భక్తి ఉద్యమ కాలంలో సమాజానికి దిశా నిర్దేశం చేసిన రచనల్లో మీరాబాయి రచనలు ప్రముఖంగా నిలిచాయి.
    సమాజంలోని దురాచారాలను తొలగించడానికి కబీర్‌దాస్‌ అనే హిందీ ప్రజాకవి చాలా తోడ్పడ్డారు. అనైతిక దృశ్యం ఏది కనిపించినా తన రచనలు, దోహాలలో ఎత్తి చూపారు. ఆయన కవిగానే కాకుండా సంఘ సంస్కర్తగా పేరుపొందారు. బీజక్‌ ఇతని ప్రధాన గ్రంథం. ‘సాఖీ, సబద్, రమైనీ’ దీనిలోని భాగాలు, ‘తెలుగు కవి వేమనను ఆంధ్ర కబీర్‌గా పిలుస్తారు.
    స్వాతంత్య్రోద్యమంలో హిందీ భాష కీలకపాత్ర పోశించింది. దేశ ప్రజలందరినీ ఏకం చేసి వారి భావాలను పంచుకోవడానికి దోహడపడింది. భారతీయులంతా ఒక్కటే అనే ఐక్యతాభావాన్ని పెంపొందించింది.
    హిందీ భాష హమారీ జాన్‌హై, హమారీ పహ్‌చాన్‌ హై అంటూ మహాత్మాగాంధీ హిందీని కీర్తించారు. దక్షిణభారత హిందీ ప్రచార సభ ఏర్పాటుకు, దక్షిణ భారతదేశంలో హిందీ భాష ప్రచారానికి, వ్యాప్తికి మహాత్మాగాంధీ కృషి చేశారు.
    ప్రపంచంలో 150 కంటే ఎక్కువ యూనివర్సిటీలు హిందీకి సంబంధించిన కోర్సులను నిర్వహిస్తున్నాయి. హిందీకి దేశంలోనే కాక, విదేశాల్లోనూ క్రేజ్‌ ఉంది.
    భారత మాజీ ప్రధాని అటల్‌బీహారీ వాజ్‌పేయి హిందీ భాషలో ఐక్య రాజ్యసమితిలో మాట్లాడి హిందీ భాషా మాధుర్యాలను ప్రపంచానికి తెలియజేశారు.
     
    జాతీయ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారు
    – గఫూర్‌శిక్షక్, హిందీ శిక్షక్‌ సమితి వ్యవస్థాపక గౌరవాధ్యక్షుడు
    భాషలపై ప్రభుత్వాలు నిర్లక్ష్య విధానాలను అనుసరిస్తున్నాయి. జాతీయ భాషగా గుర్తింపు, గౌరవం ఉన్నప్పటికీ అమలులోకి రాకుండా, ఆంగ్లభాషను వాడుతూ హిందీకి సరైన గౌరవం ఇవ్వడం లేదు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలను ఏకం చేయడంలో ఉపయోగపడిన హిందీని కాపాడుకోవడమే కాదు.. తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement