The majority
-
రాష్ట్ర భాష హిందీ
నేడు హిందీ దివస్ మన జాతీయ భాష హిందీ. ప్రపంచ భాషలలో చైనీస్ తరువాత అత్యంత ప్రాచుర్యం ఉన్న భాషగా గుర్తింపు పొందింది. జాతీయ సమైక్యత, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఈ భాష తోడ్పడుతోంది. బుధవారం హిందీ భాషా దివస్(హిందీ భాషా దినోత్సవం). ఈ నేపథ్యంలో హిందీ భాష విశిష్టతలపై ప్రత్యేక కథనం.. కామారెడ్డి : ‘హిందీ భాష హమారి జాన్ హై, హమారి పహ్చాన్ హై’ అంటూ దేశ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో మహాత్మాగాంధీ హిందీ భాష ఔన్నత్యాన్ని చాటారు. దేశ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ఈ భాషను విస్తృతంగా వాడుకున్నారు. దేశంలో అత్యధికులు మాట్లాడేది హిందీ భాష. ఇది దేశ ప్రజల మధ్య సంధాన భాషగా ఉపయోగపడుతోంది. దేశ జాతీయ భాషగా రాజ్యాంగం హిందీని గుర్తించిన సెప్టెంబర్ 14ను దేశంలో హిందీ దివస్‌గా జరుపుకుంటున్నారు. దేశంలోని 10 రాష్ట్రాల్లో హిందీ అధికార భాష. దేశ అధికార భాషగా హిందీ ఉంటుందని రాజ్యాంగంలోని 17వ భాగంలో 343 ఆర్టికల్‌లో పేర్కొన్నారు. అదే ఆర్టికల్‌లో రాజ్యంగం అమలులోనికి రాగానే 15 సంవత్సరాల వరకు అన్ని రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఆంగ్ల భాష ప్రయోగం కూడా చేయవచ్చని పేర్కొన్నారు. 1965కు ఆ నిబంధన పూర్తి కావాలి. కానీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. పాలకులు ఆంగ్లభాషనే ఇంకా వ్యవహారంలో ఉంచి హిందీ భాషకు ద్రోహం చేస్తున్నారని హిందీ భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందీ భాష లిపి దేవనాగరి లిపి. హిందీ భాషకు పశ్చిమ హిందీ, పూర్వీహిందీ, ఖడీబోలీ, రాజస్థానీ, పహడీ, బీహారీ లాంటివి ఉపభాషలు. హిందీ భాషలో సూరదాసు సూర్యుడిగా, తులసీదాసు చంద్రుడిగా గుర్తింపు పొందారు. వీరు రాసిన సూర్‌సాగర్, రామచరితమానస్‌లు జీవగ్రంథాలుగా పేరుపొందాయి. మీరాబాయి కృష్ణుని భక్తిలో లీనమై రాసిన భజన పాటలు పదావళిలో ఉన్నాయి. భక్తి ఉద్యమ కాలంలో సమాజానికి దిశా నిర్దేశం చేసిన రచనల్లో మీరాబాయి రచనలు ప్రముఖంగా నిలిచాయి. సమాజంలోని దురాచారాలను తొలగించడానికి కబీర్దాస్ అనే హిందీ ప్రజాకవి చాలా తోడ్పడ్డారు. అనైతిక దృశ్యం ఏది కనిపించినా తన రచనలు, దోహాలలో ఎత్తి చూపారు. ఆయన కవిగానే కాకుండా సంఘ సంస్కర్తగా పేరుపొందారు. బీజక్ ఇతని ప్రధాన గ్రంథం. ‘సాఖీ, సబద్, రమైనీ’ దీనిలోని భాగాలు, ‘తెలుగు కవి వేమనను ఆంధ్ర కబీర్‌గా పిలుస్తారు. స్వాతంత్య్రోద్యమంలో హిందీ భాష కీలకపాత్ర పోశించింది. దేశ ప్రజలందరినీ ఏకం చేసి వారి భావాలను పంచుకోవడానికి దోహడపడింది. భారతీయులంతా ఒక్కటే అనే ఐక్యతాభావాన్ని పెంపొందించింది. హిందీ భాష హమారీ జాన్‌హై, హమారీ పహ్చాన్ హై అంటూ మహాత్మాగాంధీ హిందీని కీర్తించారు. దక్షిణభారత హిందీ ప్రచార సభ ఏర్పాటుకు, దక్షిణ భారతదేశంలో హిందీ భాష ప్రచారానికి, వ్యాప్తికి మహాత్మాగాంధీ కృషి చేశారు. ప్రపంచంలో 150 కంటే ఎక్కువ యూనివర్సిటీలు హిందీకి సంబంధించిన కోర్సులను నిర్వహిస్తున్నాయి. హిందీకి దేశంలోనే కాక, విదేశాల్లోనూ క్రేజ్ ఉంది. భారత మాజీ ప్రధాని అటల్‌బీహారీ వాజ్‌పేయి హిందీ భాషలో ఐక్య రాజ్యసమితిలో మాట్లాడి హిందీ భాషా మాధుర్యాలను ప్రపంచానికి తెలియజేశారు. జాతీయ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారు – గఫూర్‌శిక్షక్, హిందీ శిక్షక్ సమితి వ్యవస్థాపక గౌరవాధ్యక్షుడు భాషలపై ప్రభుత్వాలు నిర్లక్ష్య విధానాలను అనుసరిస్తున్నాయి. జాతీయ భాషగా గుర్తింపు, గౌరవం ఉన్నప్పటికీ అమలులోకి రాకుండా, ఆంగ్లభాషను వాడుతూ హిందీకి సరైన గౌరవం ఇవ్వడం లేదు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలను ఏకం చేయడంలో ఉపయోగపడిన హిందీని కాపాడుకోవడమే కాదు.. తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. -
మనోళ్ల సత్తా
సాక్షిప్రతినిధి, వరంగల్ :రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మన జిల్లా అధికార పార్టీ నేతల వ్యూహాలు ఫలించాయి. జిల్లా నేతలు ఇన్చార్జులుగా వ్యవహరించిన డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు మంచి మెజారిటీతో విజయం సాధించారు. హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో, నామినేటెడ్ పోస్టుల విషయంలో ప్రభావితం చేస్తాయని టీఆర్ఎస్ నేతలుభావిస్తున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం జిల్లాకు చెందిన 14 మంది కీలక నేతలకు హైదరాబాద్ ఎన్నికల బాధ్యతలనుఅప్పగించింది. హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎక్కువ మంది నేతలు తమకు కేటాయించిన డివిజన్లలో టీ ఆర్ఎస్ను గెలిపించుకున్నారు. అరుుతే, కాం గ్రెస్ నేతలకు మాత్రం చేదు ఫలితాలే వచ్చాయి. డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ ప్రచార బాధ్యతలు నిర్వహించిన మంగల్హాట్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పరమేశ్వరిసింగ్ 9,376 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మహబూబాబాద్ మాజీ ఎమ్మె ల్యే మాలోత్ కవిత ఈ డివిజన్‌లోనే ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు వెంకటేశ్వరకాలనీ డివిజన్లో ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె కవిత 8,181 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గత ఎన్నికల వరకు కాం గ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ డివిజన్‌లోనే టీ ఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత ఇళ్లు ఉంది. గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్ ప్రచార బాధ్యతలు నిర్వహిం చిన మల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి దేవేందర్‌రెడ్డి 7,989 ఓట్ల మెజారిటీతో గెలి చారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉప్పల్ నియోజకవర్గం మొత్తాన్ని సమన్వ యం చేయడంతోపాటు ఈ డివిజన్లో ప్రచా రం నిర్వహించారు రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌లు ఏఎస్.రావు నగర్ డివిజన్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి పజ్జూరి పావని 7,987 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే డి.వినయభాస్కర్ చిలుకానగర్ డివిజన్లో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. వినయ్భాస్కర్ది నగర నియోజకవర్గం(గ్రేటర్ వరంగల్) కావడంతో అక్కడ పక్కా ఎన్నికల వ్యూహం అమలు చేశా రు. ఈ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి సరస్వతి 7,982 ఓట్లతో విజయం సాధించారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ నర్సింగరావు చర్లపల్లి డివిజన్లో ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి బొంతు రామ్మోహన్ 7,869 ఓట్ల ఆధిక్యంతో గెలి చారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి కూడా ఈ డివిజన్‌లోనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బాధ్యతలు నిర్వహించిన హబ్సీగూడ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి స్వప్నారెడ్డి గెలిచారు. ఆమెకు 7,468 ఓట్ల మెజారిటీ లభించింది. మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ మాదాపూర్ డివిజన్లలో ప్రచారం బాధ్యతలు చేపట్టారు. ఈ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్వర్ 6,005 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మీర్‌పేట డివిజన్లో ప్రచారం బాధ్యతలు నిర్వర్తించా రు. టీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య 5707 ఓట్ల ఆధిక్యంతో ఈ డివిజన్లో గెలిచారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ప్రచార బాధ్యతలు నిర్వహించిన జగద్గిరిగుట్టలో టీ ఆర్ఎస్ అభ్యర్థి జగన్ 5,559 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రచార బాధ్యతలు నిర్వహించిన రామాంతపూర్ డివి జన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి జోత్స్న 5,157 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జనగామ ఎమ్మెల్యే ఎం.యాదగిరిరెడ్డి కాప్రా డివిజన్లో ప్రచార విధులు నిర్వహించారు. ఈ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రావణ్‌రాజ్ 5029 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముషీరాబాద్ డివిజన్లో ప్రచార బాధ్యతలు చేపట్టా రు. టీఆర్ఎస్ అభ్యర్థి భాగ్యలక్ష్మి 4,124 ఓట్ మెజారిటీతో గెలిచారు. ఇక్కడి టీఆర్ఎస్ అ భ్యర్థిపై మొదట వ్యతిరేతక వ్యక్తమైంది. అరూ రి రమేశ్ స్థానిక నేతలను సమన్వయం చేసి భాగ్యలక్ష్మి గెలుపులో కీలకపాత్ర పోషించారు మహబూబాబాద్ ఎమ్మెల్యే బి.శంకర్‌నాయక్ ప్రచార బాధ్యతలు తీసుకున్న బోలక్పూర్ డివిజన్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి అహ్మద్ టీఆర్ఎస్ అభ్యర్థిపై 2,029 ఓట్ల మెజారిటీతో గెలిచారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య ప్రచా ర బాధ్యతలు నిర్వహించిన నాచారం డివి జన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శాంతి 152 ఓట్ల ఆధికత్యంతో గెలిచారు. ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రచారం చేసిన జాంబాగ్ డివిజన్‌లోనూ టీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఈ డివిజన్లో ఎంఐ ఎం అభ్యర్థి మోహన్ ఐదు ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
ప్రాదేశిక పోరులో గెలుపు మాదే
క్సీసర,న్యూస్‌లైన్: జెడ్పీటీసీ,ఎంపీటీసీ ,సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ కోరారు. ఆదివారం మండలంలోని నాగారం , దమ్మాయిగూడ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. అనంతరం నాగారంలో గల ముప్పుఎల్లారెడ్డి గార్డెన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు జరుగాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. నగరానికి చేరువలోఉన్న నాగారం,దమ్మాయిగూడ గ్రామాలకు రూ.3 కోట్లతో కృష్ణానీటిని అందిస్తామన్నారు. కుషాయిగూడ-నాగారం రోడ్డువిస్తరణ , లోఓల్టేజీ నివారణకు నాగారంలో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జవహర్‌నగర్ చెత్త డంపింగ్‌ను ఇక్కడి నుంచి తరలించే విధంగా రానున్న రోజుల్లో పోరాటం చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్‌ప్రభుత్వమేనన్నారు. నాగారం, చీర్యాల, ఆర్జికే తదితర గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెన్నమరాజు ప్రభాకర్‌గౌడ్, నేతలు ముప్పురాంరెడ్డి, కందాడి భూపాల్‌రెడ్డి, తటాకం నారాయణశర్మ, జెడ్పీటీసీ అభ్యర్థి తటాకం పద్మ,మాజీ సర్పంచ్ అశోక్‌గౌడ్, నేతలు తటాకం వెంకటేష్,కందాడిస్కైలాబ్‌రెడ్డి, గూడూరు మహే ష్, ఆంజనేయులు తదితరులున్నారు.