ప్రపంచంలోని వివిధ దేశాలలో ఒకే రకమైన నేరానికి వేర్వేరు శిక్షల నిబంధన కనిపిస్తుంది. చిన్న నేరాలకు సైతం కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే దేశాలు అనేకం ఉన్నాయి. హత్య, అత్యాచారం, వికృత హింస వంటి తీవ్రమైన నేరాలకు మరణశిక్ష విధించే నిబంధన చాలా దేశాలలో అమలులో ఉంది. అయితే ప్రపంచంలోని వివిధ దేశాలు మరణశిక్షకు సంబంధించి వివిధ పద్ధతులను అనుసరిస్తాయి. భారతదేశంలో ఉరి ద్వారా మరణశిక్ష విధిస్తారు. ఈ శిక్ష విధించినప్పుడు దోషిని జైలులోనే ఉరితీస్తారు.
తుపాకీతో కాల్చి..
బీబీసీ నివేదిక ప్రకారం ప్రపంచంలోని 58 దేశాల్లో మరణశిక్ష పడిన ఖైదీలకు ఉరి తీస్తారు. అయితే మరణశిక్ష విధించేందుకు కొన్ని దేశాలలో తుపాకులను ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోని 73 దేశాల్లో ఉరిశిక్షపడిన దోషులను తుపాకీతో కాల్చి మరణశిక్ష విధిస్తున్నాయి. కొన్ని దేశాల్లో మరణశిక్ష విధించడానికి పలు విధానాలు ఉన్నాయి.
పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి..
ఆఫ్ఘనిస్తాన్, సూడాన్‌తో సహా మొత్తం 6 దేశాల్లో దోషులను రాళ్లతో కొట్టి చంపుతారు. లేదా తుపాకీతో కాల్చడం ద్వారా మరణశిక్ష విధిస్తారు. యెమెన్, బహ్రెయిన్, చిలీ, థాయిలాండ్, ఇండోనేషియా, ఆర్మేనియా వంటి దేశాల్లో కాల్పుల ద్వారా మరణశిక్ష విధిస్తారు. చైనా, ఫిలిప్పీన్స్‌తో సహా ప్రపంచంలోని ఐదు దేశాలలో పాయిజన్ ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష విధిస్తారు. ప్రపంచంలోని మూడు దేశాల్లో శిరచ్ఛేదం ద్వారా మరణశిక్ష విధిస్తారు. ఇదిలావుంటే ప్రపంచంలోని చాలా దేశాలు మరణశిక్ష నిబంధనను రద్దు చేశాయి. ఈ జాబితాలో 97 దేశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: రైలు కదిలేముందు జర్క్ ఎందుకు? న్యూటన్ నియమంతో సంబంధం ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment