2050 నాటికి ప్రపంచంలో అతిపెద్ద 'జనశక్తి'గా భారత్ | India to be world's most populous nation by 2050 | Sakshi
Sakshi News home page

2050 నాటికి ప్రపంచంలో అతిపెద్ద 'జనశక్తి'గా భారత్

Published Wed, Oct 2 2013 4:02 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

India to be world's most populous nation by 2050

అమెరికాలో డాలర్లు పండును, భారత్లో సంతానం పండును అని మహాకవి తిలక్ ఎప్పుడో విశదీకరించి చెప్పాడు. ఆ  సంతానం అలా ఇలా కాకుండా విరగపండుతోందని ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమొగ్రఫిక్ స్టడీస్ (ఐఎన్ఈడీ) మంగళవారం విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది. 2050 నాటికి భారత్ ప్రపంచంలో అతిపెద్ద జనశక్తిగా అవతరిస్తోందని ఫ్రెంచ్ సంస్థ విడుదల చేసిన నివేదిక కుండబద్దలు కొట్టింది. జనాభాను పెంచే క్రమంలో భారతీయులు చైనీయులను సైతం తలదన్ని మరి మందుకు వెళ్లతారని పేర్కొంది. అందుకు సంబంధించి గణాంకాలను సోదాహరణగా వివరించింది.

 

ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.1 బిలియన్ల మంది అని, 2050 నాటికి ఆ సంఖ్య 9.7 బిలియన్లకు చేరుతోందని చెప్పింది. అలాగే ప్రస్తుత తరుణంలో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా 1.3 బిలియన్ల మందితో చైనా అగ్రస్థానంలో నిలబడింది. అ తర్వతా స్థానాన్ని 1.2 బిలియన్లతో భారత్ కైవసం చేసుకోంది. ఆ త్వరాత స్థానాలు యూఎస్ (316.2 మిలియన్లు) ఇండోనేషియా (248.5 మిలియన్లు), బ్రెజిల్ 195.5 మిలియన్లు) వరుసగా అక్రమించాయని తెలిపింది.

 

అయితే 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుతోందని ఈ ఏడాది జూన్లో యూఎన్ విడుదల చేసిన నివేదిక వివరాలను ఈ సందర్భంగా ఫ్రెంచ్ సంస్థ విడుదల చేసిన నివేదిక గుర్తు చేసింది. గత రెండు శతాబ్దాల కాలంలో ఎన్నడు లేని విధంగా రానున్న రోజుల్లో ప్రపంచ జనాభా పెరుగుతారని ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్కు చెందిన సీనియర్ పరిశోధకుడు గీల్స్ పిసన్ తెలిపారు. 21 వ శతాబ్దం చివర నాటికి ప్రపంచ జనాభా 10 నుంచి 11 బిలియన్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement