
న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తప్పులో కాలేసింది. కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా ఫేస్‌బుక్ పేర్కొంది. అయితే వెంటనే పొరపాటును గుర్తించి క్షమాపణలు ప్రకటించింది. ఇరానియన్ నెట్‌వర్క్ ద్వారా ప్రభావితమైన దేశాలు, ప్రాంతాలు జాబితాలో కశ్మీర్‌ను పొరపాటున చేర్చామని ఫేస్‌బుక్ ప్రకటనలో తెలిపింది.
ఇరాన్ నెట్‌వర్క్‌లకు లక్ష్యంగా మారిన దేశాలను ప్రస్తావించిన బ్లాగ్ పోస్టులో పెట్టిన జాబితాలో ఈ పొరపాటు దొర్లింది. ఇరాన్‌కు సంబంధించిన బహుళ నెట్‌వర్క్‌లు అనధీకృత చర్యలకు పాల్పడిన కారణంగా 513 పేజీలను, గ్రూపులు, ఇతర ఖాతాలను తొలగించినట్లు ఫేస్‌బుక్ పేర్కొంది. ఈజిప్టు, ఇండియా, ఇండోనేసియాలతోపాటు కశ్మీర్‌ను సదరు దేశాల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలోంచి కశ్మీర్ పేరును చేర్చి ఉండాల్సింది కాదనీ, ఈ గందరగోళానికి క్షమించాలని కోరింది. అలాగే కశ్మీర్ పేరును ఈ జాబితాలోంచి తొలగించామని ఫేస్‌బుక్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment