పోలవరం ప్రాజెక్టు దేశానికి ఆణిముత్యమని, దానికోసం నిర్వాసితులు త్యాగం చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. గూటాల పంచాయతీ మహాలక్ష్మీదేవిపేటలో ఆదివారం శివాజీ, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతలను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు.
పోలవరం కోసం నిర్వాసితులు త్యాగం చేయాలి
Aug 22 2016 12:56 AM | Updated on Sep 4 2017 10:16 AM
పోలవరం : పోలవరం ప్రాజెక్టు దేశానికి ఆణిముత్యమని, దానికోసం నిర్వాసితులు త్యాగం చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. గూటాల పంచాయతీ మహాలక్ష్మీదేవిపేటలో ఆదివారం శివాజీ, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతలను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ నిర్వాసితులకు తాను అండగా ఉంటానని చెప్పారు. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వల్లే తాము ఈ హోదాలో ఉన్నట్టు తెలిపారు. అంతకుముందు వారు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి సుజాతను కారెం శివాజీ సత్కరించగా ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు శివాజీని సన్మానించారు. ఘంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ పారేపల్లి రామారావు, పొన్నాల అనిత , అలుగు ఆనందశేఖర్, ఆర్డీవో ఎస్.లవన్న, జెడ్పీటీసీ కుంజం సుభాషిణి పాల్గొన్నారు.
Advertisement
Advertisement