దేశ సంచారానికి బయలు దేరిన పీఠాధిపతి
ఆళ్లగడ్డ: అహోబిలం దేవస్థాన పీఠాథిపతి శ్రీ శఠగోప రంగరాజ యతీంద్ర మహాదేశికన్ దేశ సంచారం చేసేందుకు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి గురించి ప్రచారం నిర్వహించడంతో పాటు వివిధ దేశాల్లో ఉన్న భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించేందుకు స్వామి ఉత్సవ విగ్రహంతో పీఠాధిపతి సంచారం చేయడం ఆనవాయితీ. బయలుదేరడానికి ముందు ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠంలో ఉన్న శిష్యులు, భక్తులకు ఆశీర్వదాలు అందజేశారు .