pontiff
-
మురుఘ మఠాధిపతికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
సాక్షి,బెంగళూరు: రాష్ట్రమంతటా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో చిత్రదుర్గ మురుఘ మఠాధిపతి రాజేంద్ర శివమూర్తి స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైస్కూల్ బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న మురుగ మఠానికి చెందిన శివమూర్తి మురుగ శరణారావుకు.. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మురుగ మఠాధదిపతి శివమూర్తికి ఛాతీలో నొప్పి రావడంతో భారీ బందోబస్తు మధ్య చిత్రదుర్గ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత అనంతపురం జిల్లా జైలుకు తరలించనున్నట్లు చిత్రదుర్గ పోలీసు సూపరింటెండెంట్ పరశురాం తెలిపారు. కాగా గురువారం రాత్రి మురుఘ రాజేంద్ర మఠంలో స్థానిక పోలీసులు భారీ బందోబస్తు మధ్య అరెస్ట్ చేసి వైద్య పరీక్షలకు తరలించారు. గత నెల 26న చిత్రదుర్గలోని మురఘశ్రీ హాస్టల్లో చదువుకుంటున్న ఇద్దరు మైనర్ విద్యార్థినులు స్వామీజీపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడంతో మైసూరు నజరాబాద్ పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వారంరోజుల ఉత్కంఠ వారం రోజులుగా ఈ విషయం రాష్టవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టులో స్వామీజీ చేసుకున్న దరఖాస్తుపై విచారణ కూడా శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు మఠం వద్ద పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. చివరకు రాత్రి హైడ్రామా మధ్య స్వామీజీ అరెస్ట్‌ను ప్రకటించారు. ఇదివరకే జడ్జి ముందు బాలికలు వాంగ్మూలం ఇచ్చారు. శుక్రవారం నుంచి స్వామీజీని పోలీసులు విచారించనున్నారు. స్వామీజీకి మద్దతుగా, వ్యతిరేకంగా పలువురు నేతలు ప్రకటనలు చేశారు. చదవండి: కాబోయే భర్తే కదా అని శారీరకంగా దగ్గరైంది.. కానీ, ఆ తర్వాతే.. -
మదురై మఠాధిపతి కన్నుమూత
మదురై: మదురైలో ప్రసిద్ధి చెందిన శైవ మఠం ఆధీనం(మఠాధిపతి) అరుణగిరినాధర్ (77) శుక్రవారం కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కొద్దిరోజుల క్రితం ఆయనను మదురైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారని అధీనం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 1,500 సంవత్సరాల చరిత్ర ఉన్న శైవ మఠానికి ఆయన 292వ పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. అరుణగిరినాధర్ మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామిలు సంతాపం వ్యక్తం చేశారు. శైవ మత సూత్రాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు సీనియర్ పాత్రికేయులుగా పని చేస్తూ ప్రజోపకరమైన పనులలో ఆయన నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. ఆయన మరణం తీరని లోటు అని చెప్పారు. తమిళ ప్రపంచానికి ఆయన మరణం పెద్ద లోటు అంటూ ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
పుష్కర నిధులు దుర్వినియోగం
రాష్ట్ర సర్కారుపై పీఠాధిపతులు, స్వామీజీల మండిపాటు గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పవిత్ర కృష్ణా, గోదావరి పుష్కరాలను తన ప్రచారానికి వాడుకున్న చంద్రబాబు ప్రభుత్వం రూ.4 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు, సేవా సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాలప్పుడు కూల్చిన 46 ఆలయా లను ప్రభుత్వ ధనంతో పునర్నిర్మిం చాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ రామా ఫంక్షన్ హాలులో ‘హిందూ ధర్మం – సవాళ్లు – భవిష్యత్’ అనే అంశంపై ఆదివారం సదస్సు జరిగింది. విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు శివస్వామి, హరిహర పీఠాధిపతి హరేశ్వరానంద, రామానుజ సిద్ధాంత ప్రచార సంఘం కార్యదర్శి డీఎస్ఎన్వీ ప్రసాదబాబు, గాయకుడు గజల్ శ్రీనివాస్, కనకదుర్గ ధర్మ ప్రచార పరిషత్ డైరెక్టర్ రాజగోపాల చక్రవర్తి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
దేశ సంచారానికి బయలు దేరిన పీఠాధిపతి
ఆళ్లగడ్డ: అహోబిలం దేవస్థాన పీఠాథిపతి శ్రీ శఠగోప రంగరాజ యతీంద్ర మహాదేశికన్ దేశ సంచారం చేసేందుకు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి గురించి ప్రచారం నిర్వహించడంతో పాటు వివిధ దేశాల్లో ఉన్న భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించేందుకు స్వామి ఉత్సవ విగ్రహంతో పీఠాధిపతి సంచారం చేయడం ఆనవాయితీ. బయలుదేరడానికి ముందు ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠంలో ఉన్న శిష్యులు, భక్తులకు ఆశీర్వదాలు అందజేశారు . -
వైభవోపేతంగా పెద్దదర్గా ఉరుసు
కడప కల్చరల్ : పెద్దదర్గా ఉరుసు శనివారం వైభవోపేతంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ముషాయిరా హాలులో ఇదారే అమినియా చిష్ఠియా నివేదిక సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. దర్గా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సేవా సంస్థల కార్యక్రమాల వివరాలను ఆయా సంస్థల ప్రతినిధులు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌కు సమర్పించారు. ఆయన వాటికి ఆమోదం తెలిపారు. దర్గా ప్రాంగణంలో పీఠాధిపతి ఆధ్వర్యంలో ఆషారే షరీఫ్ దర్శనం చేయించారు. స్థానిక ప్రముఖులు, ఖలీఫాలు, ఫకీర్లు, చౌదరీలు ఆసారే షరీఫ్‌ను తిలకించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. రాత్రి కడప నగరం మార్కెట్‌కు చెందిన వస్త్ర వ్యాపారులు పూల చాందినీని ఊరేగింపుగా తీసుకు రాగా బజారుకు చెందిన ఎద్దుల బండ్ల చౌదరీలు, ఖలీఫాలు చాందిని, గంధం కలశాన్ని బ్యాండు మేళాలతో ఊరేగింపుగా దర్గాకు చేర్చారు. పీఠాధిపతి వాటితో దర్గా గురువుల మజార్ వద్ద ప్రార్థనలు చేపట్టారు. అనంతరం ముషాయిరా హాలులో ప్రముఖ ఖవ్వాలీ గాయకులచే కచేరీ ఉత్సాహ భరితంగా నిర్వహించారు. చాదర్‌తో కలెక్టర్.. జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ ఉరుసు సందర్భంగా దర్గాలో పవిత్ర చాదర్ సమర్పించారు. వన్‌టౌన్ కూడలిలో దర్గా ప్రతినిధులు తెచ్చిన చాదర్‌ను ఆయన తలపై ఉంచుకుని వైవీ స్ట్రీట్ ద్వారా దర్గాకు చేరుకున్నారు. ఫకీర్లు సాహస విన్యాసాలతో ఆయన వెంట సాగారు. అనంతరం దర్గాలోని ప్రధాన గురువుల మజార్ వద్ద చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
పీఠాధిపతి తిరుపతి పర్యటన
– నేడు శ్రీవారి మెట్లోత్సవానికి హాజరు మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తిరుపతి పర్యటనకు ఆదివారం బయలుదేరి వెళ్లారు. సోమవారం తిరుమలలోని రాఘవేంద్రస్వామి మృత్తిక బృందావనం మఠంలో పిలిగ్రిం ఇమ్యూనిటీ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. సాయంత్రం గురుసార్వభౌమ దాస సాహిత్య మండలి భజన భక్తాదులతో శ్రీవారి ఆది మెట్లను చేరుకుంటారు. అక్కడ పీఠాధిపతి విశిష్ట పూజల నిర్వహించి మెట్లోత్సవానికి అంకురార్పణ పలుకుతారు. దాదాపు వెయ్యి మంది భక్తులతో కలిసి కాలినడక శ్రీవారిని దర్శించుకుంటారు. మంగళవారం అక్కడే రాములోరి పూజా కార్యక్రమాలు ముగించుకుంటారు. సాయంత్రం పీఠాధిపతులకు సన్మానం ఉంటుందని మఠం మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.