దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరిన పలువురు నేతలు ఢిల్లీ తమకు రన్ వే అని నిరూపించారు. ఇక్కడి నుంచి గెలిచిన పలువురు నేతలు రాజకీయాల్లో తారాస్థాయికి చేరుకున్నారు. ఢిల్లీలో విజయం సాధించాక తొలిసారిగా లోక్‌సభకు ముగ్గురు నేతలు చేరారు. వీరిని కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులు వరించాయి.
ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి, దేశ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిలో సుచేతా కృపలానీ పేరు మొదటిగా వినిపిస్తుంది. ఆమె 1952లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. తరువాత ఆమె 1960లో ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా ఎన్నికై నాటి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. మూడేళ్ల తరువాత 1963లో ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలో ఇంతటి అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా సుచేతా కృపలానీ నిలిచారు.
బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ కూడా తొలిసారిగా 1989లో ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. ఆ తర్వాత దేశానికి ఉప ప్రధానిగా కూడా నియమితులయ్యారు. 1991లో న్యూ ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. నాడు కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటుడు రాజేష్ ఖన్నాను ఓడించారు. ఈ క్రమంలోనే 1977లో లాల్ కృష్ణ అద్వానీ కేంద్ర మంత్రి కూడా అయ్యారు.
బీజేపీ దిగ్గజ నేత, ఢిల్లీ తొలి మహిళా సీఎం సుష్మా స్వరాజ్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా లోక్‌సభకు చేరుకున్నారు. 1996లో రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత, ఆమె దక్షిణ ఢిల్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల తర్వాత ఆమె 13 రోజుల అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. దీని తరువాత ఆమె 1998లో దక్షిణ ఢిల్లీ నుంచి మరోమారు గెలిచారు. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో సాహిబ్ సింగ్ స్థానంలో బీజేపీ ఆమెను ఢిల్లీ ముఖ్యమంత్రిని చేసింది. 2009-2014 మధ్యకాలంలో ఆమె లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా కూడా వ్యవహరించారు. మోదీ ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment