దేశ భవితకు రాజ్యాంగం దిక్సూచి
దేశ భవితకు రాజ్యాంగం దిక్సూచి
Published Sun, Nov 27 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
కాకినాడ సిటీ : అందరికీ సమాన హక్కులు కల్పించిన భారత రాజ్యాంగం దేశ భవిష్యత్‌కు ఒక దిక్సూచి వంటిదని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. శనివారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాకినాడ ఇంద్రపాలెం లాకుల సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రోజు పవిత్రమైనదని, ఈ రాజ్యాంగం ద్వారా కేంద్ర, రాష్ట్ర పరిపాలన, ప్రజలకు బాధ్యతలు, హక్కులు కల్పిస్తూ ఒక ఆదర్శమైన పాలనకు మార్గం చూపారన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ అసమాన ప్రతి భను చూపారన్నారు. భారత రాజ్యాంగంపై పూర్తి అవగాహన కోసం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో చర్చ జరపవలసిన అవసరం ఉందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి, బీసీ కార్పొరేన్ ఈడీ ఎం.జ్యోతి, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, సీపీఓ మోహన్ రావు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ డీడీ చినబాబు, ఆర్‌డీఓ బీఆర్ అంబేద్కర్, డీపీఆర్వో ఎం.ఫ్రాన్సిస్, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు దనురాశి శ్యామ్ సుందర్, దళిత సంఘాల నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, ఠాగూర్, గూడాల కృష్ణ, రవికుమార్, జి.వెంకటేశ్వరరావు, కుమార్ పాల్గొన్నారు.
Advertisement