
దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ 28న దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో చలి మరింతగా పెరగనుంది.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం మహారాష్ట్ర, గోవా, కొంకణ్‌తో పాటు అనేక ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లలో కూడా వర్షాలు కురవనున్నాయి. రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నవంబర్ 27న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
నవంబర్ 27న పశ్చిమ యూపీలోని పలు జిల్లాలు, తూర్పు యూపీలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుండగా శనివారం రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో గాలి నాణ్యత మెరుగుపడింది. అయితే ఇది ఇప్పటికీ ‘తీవ్రమైన’, ‘చాలా పేలవమైన’ విభాగంలోనే ఉంది. ఆదివారం నుండి వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారం అందించే ఏజెన్సీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: 26/11 తరువాత ముంబై రైల్వే స్టేషన్ల పరిస్థితి ఇదే..