డబ్బింగ్ చిత్రాల విడుదలకు వ్యతిరేకంగా కన్నడ చిత్ర పరిశ్రమ శాండిల్‌వుడ్ మరోసారి గళం విప్పింది.
బెంగళూరు: డబ్బింగ్ చిత్రాల విడుదలకు వ్యతిరేకంగా కన్నడ చిత్ర పరిశ్రమ శాండిల్‌వుడ్ మరోసారి గళం విప్పింది. కన్నడ చిత్ర పరిశ్రమలోకి అనువాద చిత్రాలు రాకుండా అడ్డుకోవాలంటూ కన్నడ సినీ కళాకారులు సమష్టిగా నినదించారు. డబ్చింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా శాండిల్‌వుడ్ సోమవారం బంద్ పాటిస్తోంది.
కన్నడ చిత్ర పరిశ్రమలో తెలుగు, తమిళ చిత్రాల హవా ఎప్పటి నుంచో కొనసాగుతోంది. కర్ణాటకలో తెలుగు, తమిళ భాషలు మాట్టాడే ప్రజలు ఎక్కవగా ఉండటంతో కన్నడ చిత్రాలకు సమాంతరంగా వీటికి ఆదరణ లభిస్తోంది. ఒక్కోసారి కన్నడ సినిమాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇక కన్నడలోకి అనువాదం చేయడం వల్ల తమకు చాలా నష్టం ఏర్పడుతోందంటూ శాండిల్‌వుడ్ ప్రముఖులు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు. దీనిపై చాలాకాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో డబ్చింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా శాండిల్‌వుడ్ మరోసారి నిరసన బాట పట్టింది.