
సాక్షి, ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ విజేతలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఘనంగా సన్మానించింది. సోమవారం ఢిల్లీలోని హోటల్ అశోక్‌లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, రవికుమార్, పీవీ సింధు, భజరంగ్ పునియా, లవ్లీనా, హాకీ పురుషుల జట్టుకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రులు, అధికారులు క్రీడాకారులు, కోచ్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. దేశానికి స్వర్ణపతకం తేవడాన్ని గర్వంగా భావిస్తున్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment